ప్రస్తుతం వింటర్ సీజన్ లో( Winter ) కొందరికి హెయిర్ ఫాల్( Hair Fall ) అనేది చాలా అధికంగా ఉంటుంది.వాతావరణంలో వచ్చే మార్పులు, కాలుష్యం, ఒత్తిడి, వేడి వేడి నీటితో తల స్నానం చేయడం, రసాయనాలు అధికంగా ఉండే షాంపూలను వినియోగించడం తదితర కారణాల వల్ల హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది.
అయితే ఈ సమస్యను జామ ఆకులతో పరిష్కరించుకోవచ్చు.జామ ఆకులు( Guava Leaves ) జుట్టు రాలడాన్ని అరికట్టడంలో అద్భుతంగా తోడ్పడతాయి.
మరి ఇంతకీ వాటిని ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక చిన్న కప్పు వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక నాలుగు నుంచి ఐదు జామ ఆకులు వేసి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్ లో ఉడికించిన జామ ఆకులను వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఈ జామాకుల మిశ్రమంలో ఒక ఎగ్ వైట్( Egg White ) మరియు రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) వేసి బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాలు అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకసారి ఈ విధంగా చేయడం వల్ల స్కాల్ప్ లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.జామ ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు హెయిర్ ఫోలికల్స్‌ను బలహీనపరిచే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి.
గుడ్డులో ఉండే ప్రోటీన్లు జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.జామ మరియు గుడ్డు కలయిక జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అడ్డుకుంటాయి.పైగా జామ ఆకుల్లో ఉండే విటమిన్ బి మరియు విటమిన్ సి జుట్టు కుదుళ్లను పోషించి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.జామ ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ మరియు అనాల్జేసిక్ గుణాలు ఉంటాయి.
ఇవి స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడడంలో మరియు చుండ్రుకు చికిత్స చేయడంలో తోడ్పడతాయి.