టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో రవికిషన్ ( Ravikishan )ఒకరు.నటుడిగా కాక రాజకీయ నాయకుడిగా సైతం పాపులర్ అవుతున్న రవికిషన్ బాల్యంలోనే యాక్టింగ్ పై మనసు పారేసుకున్నాడు.
అయితే రవికిషన్ తండ్రికి మాత్రం కొడుకు సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు.ఒక సందర్భంలో రవికిషన్ తండ్రి రవికిషన్ ను విపరీతంగా కొట్టారు.
రవికిషన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు.మా ఊరిలో రామ్ లీలా ( Ram Leela )అనే నాటకం వేసేవారని నేను ఆ నాటకంలో సీత పాత్రలో నటించేవాడినని ఆయన అన్నారు.
ఒకరోజు మా నాన్నకు ఆ విషయం తెలిసిందని రవికిషన్ చెప్పుకొచ్చారు.ఆ సమయంలో నేను మా అమ్మ చీర తీసుకెళ్లి గాజులు వేసుకుని రోజంతా రిహార్సల్ చేస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు.
ఇంటికి వెళ్లిన వెంటనే నాన్న బెల్ట్ తీసుకుని వాయించాడని నా చర్మం ఊడిపోయేలా కొట్టాడని రవి కిషన్ చెప్పుకొచ్చారు.మా ఊరిలో నాన్నకు మంచి పేరు ఉందని నాన్నను అందరూ ఎంతో గౌరవించేవారని రవికిషన్ వెల్లడించారు.ఆ రీజన్ వల్లే నాన్న నేను అమ్మాయిలా వేషం కట్టి డాన్స్ చేస్తుంటే భరించలేకపోయారని రవికిషన్ పేర్కొన్నారు.
ఆరోజు రాత్రి అమ్మ 500 రూపాయలు నా చేతిలో పెట్టి పారిపోవాలని సూచించిందని రవికిషన్ తెలిపారు.అలా 15 సంవత్సరాల వయస్సులో ఇంటినుంచి పారిపోయి వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు.రవికిషన్ తెలుగుతో పాటు హిందీ, భోజ్ పురి సినిమాలలో సైతం నటించాడు.
రేసుగుర్రం సినిమా( resugurram movie ) తెలుగు రాష్ట్రాల్లో రవికిషన్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.రవికిషన్ తెలుగులో మరిన్ని సినిమాలలో నటించాలని అభిమానులు భావిస్తున్నారు.
హీరో రవికిషన్ కెరీర్ ప్లాన్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.