ఈ మధ్య కాలంలో అల్లు, మెగా కుటుంబాల మధ్య గ్యాప్ ఉందని మెగా అల్లు హీరోలు ఒకే చోట కలిసి కనిపించడం జరగదని ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.అయితే అల్లు అర్జున్( Allu Arjun ) ఇప్పటికే చిరంజీవి, నాగబాబులను కలవడం ద్వారా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదనే సంకేతాలను ఇచ్చారు.
ఇదే సమయంలో బాలయ్య( Balayya ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో( Unstoppable Show ) రామ్ చరణ్ కనిపించడం గమనార్హం.
త్వరలో ఈ బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ ప్రసారం కానుందని సమాచారం అందుతోంది.
చిరంజీవి( Chiranjeevi ) ఇప్పటికీ అన్ స్టాపబుల్ షోకు హాజరు కాలేదనే సంగతి తెలిసిందే.అయితే చిరంజీవి ఈ షోకు హాజరు కాకపోయినా రామ్ చరణ్ ఈ షోకు హాజరు కావడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
రామ్ చరణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బాలయ్య రామ్ చరణ్ కు సంబంధించిన సీక్రెట్స్ ఫ్యాన్స్ కు తెలిసేలా చేస్తారేమో చూడాల్సి ఉంది.2025 సంవత్సరం జనవరి నెల 10వ తేదీన గేమ్ ఛేంజర్( Game Changer ) విడుదల కానుంది.గేమ్ ఛేంజర్ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
చరణ్ శంకర్ కాంబో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుందని సమాచారం అందుతోంది.రామ్ చరణ్ క్రేజ్ మాత్రం మామూలుగా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అన్ స్టాపబుల్ సీజన్ 4( Unstoppable Season 4 ) ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ అందుకోలేదు.రామ్ చరణ్ ఎపిసోడ్ తో ఆ లోటు తీరుతుందేమో చూడాల్సి ఉంది.