తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లను సాధిస్తున్న దర్శకులు చాలామంది ఉన్నారు.అయినప్పటికి యంగ్ డైరెక్టర్లు కొత్త సినిమాలను చేస్తూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆయా దర్శకులను ఎంచుకొని వాళ్లతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వాళ్లే కావడం విశేషం.ఇక పాన్ ఇండియాలో సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న వాళ్ళ విషయం పక్కన పెడితే కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తూ మంచి విజయాలను సాధించాలి అనుకుంటున్న సీనియర్ హీరోలు అయిన నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్( Nagarjuna, Balakrishna, Venkatesh ) లాంటి నటులు ఆధ్యాంతం వాళ్లకు వాళ్లు పోటీని పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం( Sankrantiki vastunnam ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపధ్యం లో బాలయ్య బాబు కూడా ‘డాకు మహారాజు ‘ ( Daku Maharaju )అనే సినిమాతో మరోసారి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలు తెలుగు లో మాత్రమే సినిమాలు చేస్తు సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.ఇక దర్శకులు కూడా వాళ్ళ సినిమాలకు తగ్గట్టుగానే దానిని పాన్ ఇండియా రిలీజ్ చేయకుండా కేవలం ఒక భాషలోనే సినిమాలను చేయాలనే ధోరణిలో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక చిరంజీవి మాత్రమే తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…మరి ఏది ఏమైనా కూడా వాళ్లకంటు ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు…
.