ఇండియన్ పెళ్లిళ్లంటేనే సందడి, నవ్వులు, డ్రామాతో నిండి ఉంటాయి.ఒక్కోసారి ఇలాంటి పెళ్లిళ్లలో ఊహించని సంఘటనలు కూడా జరుగుతుంటాయి.
అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.పెళ్లికొడుకు వధువు మెడలో పూలమాల వేస్తుండగా, అతని మాజీ ప్రియురాలు( Ex Lover ) స్టేజిపైకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్ అవ్వడంతో పాటు నవ్వాపుకోలేరు.
వీడియోలో పెళ్లికొడుకు( Groom ) వధువుకు దండ వేస్తుండగా, అతని మాజీ ప్రియురాలు ఒక్కసారిగా స్టేజిపైకి వచ్చి అతన్ని గట్టిగా తన్నింది.
దెబ్బకి పెళ్లికొడుకు వెనక్కి పడిపోయాడు.ఆ తర్వాత అతడు లేవగానే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.వధువు( Bride ) కూడా ఆ గర్ల్ ఫ్రెండ్ పై విరుచుకు పడింది.వీడియోలో ఆమె “నన్ను మోసం చేశావ్” అని అంటున్నట్లుగా ఉంది, కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో పాట ఉండటం వల్ల స్పష్టంగా వినిపించట్లేదు.
ఈ సంఘటన చాలా ఫన్నీగా, షాకింగ్‌గా ఉండటంతో నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.వీడియో చూసిన వాళ్లంతా రకరకాల కామెంట్లు పెడుతున్నారు.“ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏమీ చేయద్దురు రా, అయ్యా” అని ఒకరి హిలేరియస్ కామెంట్ చేశారు.
“ఇలాంటి భయంతోనే నేను పెళ్లి చేసుకోవట్లేదు,” అని ఒక యూజర్ హిందీలో కామెంట్ చేశాడు.“మేడమ్ గారు ఈ బ్రదర్‌కి మంచి మసాజ్ ఇచ్చారు,” అని మరొకరు ఫన్నీగా కామెంట్ చేశారు.కొందరు అమ్మాయి చేసిన పని కరెక్ట్ అని సమర్థించారు.“మోసం చేసేవాళ్లకు ఇలాగే ఉండాలి,” అని ఒక యూజర్ ఘాటుగా కామెంట్ చేశాడు.“జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి ఆలోచించకుండా ముందుకు సాగాలి బ్రదర్,” అని మరొకరు సలహా ఇచ్చారు.ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు.ఇంతకీ వారి పెళ్లి ఆగిపోయిందా? ప్రియురాలు చివరికి అతడితో ఏకమయ్యిందా? అనే వివరాలు కూడా మిస్టరీగానే మిగిలిపోయాయి.