ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) ప్రస్తుతం పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకోవడమే కాకుండా సినీ పెద్దల ఆగ్రహానికి కూడా గురి అవుతున్న విషయం మనకు తెలిసిందే.అల్లు అర్జున్ పుష్ప 2( Pushpa 2 ) విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్దకు రావడంతో తొక్కిసలాట జరిగే రేవతి అనే అభిమాని మరణించడంతో ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది.
ఈ విషయంపై అల్లు అర్జున్ పట్ల కేసు నమోదు చేయడమే కాకుండా ఆయనని ఏకంగా జైలుకు కూడా పంపించారు.ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ఏకంగా తెలంగాణలో విడుదల అయ్యే ఏ సినిమాకి కూడా బెనిఫిట్ షోలు ఉండవు అదేవిధంగా సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచము అంటూ తేల్చి చెప్పారు.
ఇదే విషయం గురించి సినీ పెద్దలు రేవంత్ రెడ్డితో భేటీ అయి మాట్లాడిన ఆయన మాత్రం తన నిర్ణయం మార్చుకోనని తేల్చి చెప్పారు.ఈ క్రమంలోనే కొంతమంది సినిమా పెద్దలు అల్లు అర్జున్ ని పూర్తిస్థాయిలో తప్పు పడుతున్నారు.అల్లు అర్జున్ కారణంగానే ఈరోజు సినిమా పెద్దలు ప్రభుత్వం ముందు తలదించుకోవాల్సి వచ్చింది అంటూ ఆయన పై విమర్శలు కురిపిస్తున్నారు.ఈ తరుణంలోనే మరికొందరు సినీ పెద్దలను పూర్తిస్థాయిలో తప్పుపడుతున్నారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన బాధాకరమే కానీ ఇది అల్లు అర్జున్ ప్రమేయం లేకుండా జరిగినది.అందుకు తనని దోషిని చేసి తప్పు పట్టడం సరైనది కాదని తెలిపారు.అల్లు అర్జున్ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప నటుడు ఇన్ని సంవత్సరాల తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు కూడా ఏ ఒక్క నటుడికి నేషనల్ అవార్డు ( National Award ) రాలేదు కానీ అలాంటి గొప్ప అవార్డు సొంతం చేసుకున్న వ్యక్తి అల్లు అర్జున్.ఇలాంటి గొప్ప అవార్డును అందుకున్నప్పుడు తప్పనిసరిగా సినిమా ఇండస్ట్రీ ఆయనని సత్కరించాలి కానీ అప్పట్లో ఆయనకి ఎలాంటి సత్కారం చేయలేదు అంతేకాకుండా ఇప్పుడు విమర్శిస్తున్న వారందరూ అప్పుడు కనీసం బన్నీకి శుభాకాంక్షలు కూడా చెప్పలేదు.
ఇలా అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు బన్నీని తప్పు పట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ మరికొందరు తమ వాదనను గట్టిగా వినిపిస్తున్నారు.