ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) సంధ్య థియేటర్ ఘటన వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ ఘటన గురించి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించారు.
తాజాగా ఈ ఘటన గురించి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం స్పందించగా పవన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.బన్నీ తరపున ఎవరో ఒకరు బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉంటే బాగుండేదని పవన్ అన్నారు.
ఈ ఘటనలో రేవతి( Revathi ) చనిపోవడం నన్ను ఎంతగానో కలచివేసిందని బన్నీ చెప్పుకొచ్చారు.గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చారని మేమంతా అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సిందని పవన్ పేర్కొన్నారు.
తమ ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయిందని విచారం వ్యక్తం చేయాల్సిందని పవన్ తెలిపారు.ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని ఆయన చెప్పుకొచ్చారు.
అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సిందని పవన్ పేర్కొన్నారు.పరామర్శించకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన బన్నీలో ఉందని పవన్ అన్నారు.సినిమా అంటే టీమ్ అని అందరి భాగస్వామ్యం అని పవన్ వెల్లడించారు.బన్నీని మాత్రమే దోషిగా మార్చడం సరికాదని ఆయన చెప్పుకొచ్చారు.
తొక్కిసలాట ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం హోదాలో రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) స్పందించారని పవన్ వెల్లడించారు.కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని చిరంజీవి కూడా గతంలో ఫ్యాన్స్ తో కలిసి సినిమాలు చూడటానికి వెళ్లేవారని పవన్ పేర్కొన్నారు.చిరంజీవి ముసుగు వేసుకుని వెళ్లేవారని పవన్ కామెంట్లు చేశారు.
పవన్ కళ్యాణ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.