ప్రస్తుతం వింటర్ సీజన్( Winter Season ) లో చలి పులి ఎంతలా చంపేస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.అసలు ఉదయం 6 గంటల ముందు, సాయంత్రం 6 గంటల తర్వాత బయట కాలు పెట్టాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు.
ఇకపోతే చలికాలంలో చాలా మంది స్నానం చేయడానికి అస్సలు ఇష్టపడరు.ఒళ్లంతా బద్దకంగా ఉంటుంది.
అందుకే స్నానానికి మొగ్గు చూపరు.ఒకవేళ స్నానం చేసినా వేడి నీటినే పేపర్ చేస్తుంటారు.
చన్నీటి స్నానం అన్న ఆలోచన కూడా మైండ్ లోకి రానివ్వరు.

ఎవరో కొందరు మాత్రమే చన్నీటి స్నానం చేస్తుంటారు.అసలు చలికాలంలో చన్నీటి స్నానం చేయవచ్చా.? చేయకూడదా.? అన్న డౌట్ కూడా ఎంతో మందికి ఉంటుంది.వాస్తవంగా చెప్పాలంటే చలికాలంలో వేడి నీటి స్నానం కన్నా చన్నీటి స్నానమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
కోల్డ్ వాటర్ తో బాత్ చేయడం వల్ల రక్త ప్రసరణ( Blood circulation ) మెరుగుపడుతుంది.ధమనులు బలంగా మారతాయి.రక్త పోటు అదుపులో ఉంటుంది.

అలాగే వింటర్ సీజన్ లో చన్నీటి స్నానం చేయడం వల్ల ఇమ్యూనిటీ పవర్( Immunity power ) పెరుగుతుంది.మైండ్ రిఫ్రెష్ అవుతుంది.డిప్రెషన్ సమస్య ఉంటే దూరం అవుతుంది.
కోల్డ్ వాటర్ తో స్నానం చేసేటప్పుడు మన బాడీ దానంతట అదే హీటెక్కుతుంది.ఈ ప్రక్రియలో మన మెటబాలిజం రేటు పెరుగుతుంది.
మెటబాలిజం రేటు క్యాలరీలు త్వరగా కరుగుతాయి.అంటే చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు.
అంతేకాదు, చన్నీటి స్నానం వల్ల చర్మం తేమగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది.అయితే చలికాలంలో చన్నీటి స్నానం ఆరోగ్యానికి మంచిదే కానీ అందరికీ ఇది వర్తించదు.
ముఖ్యంగా వృద్ధులకు చన్నీటి స్నానం చాలా ప్రమాదకరం.వృద్ధులు చన్నీటి స్నానం చేస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
అలాగే పలు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా చన్నీటి స్నానం చేయకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.







