సినిమా ఇండస్ట్రీలో హీరోలకే కాదు విలన్లకు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది.అప్పట్లో చాలామంది విలన్లు ఉన్నప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉండేది.
నాగేశ్వరరావు ఎన్టీఆర్ గారు హీరోలుగా సినిమాలు చేసినప్పుడు వాళ్లకు విలన్ గా కైకాల సత్యనారాయణ గారు ఎక్కువ సినిమాల్లో చేసేవారు.ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత విలనిజం అనేది మార్పు చెందడం జరిగింది దాంతో కొత్త విలన్ ల వైపు హీరోలతో పాటు దర్శకులు కూడా మొగ్గు చూపారు.
అప్పుడే నాటక రంగం నుంచి వచ్చిన కోట శ్రీనివాసరావు గారితో విలన్ పాత్రలు వేయించారు.అప్పట్లో కోట గారు ఏ పాత్ర అయినా అలవోకగా చేసేవారు అలాగే చాలా సినిమాల్లో ఆయన చేసిన విలన్ పాత్రలు అయితే అందరికీ గుర్తుండిపోతాయి.
అలా ఇండస్ట్రీపై విలన్ గా తనదైన మార్కును చూపించారు కోట గారు.ఆయన తర్వాత చాలామంది విలన్లు తనదైన మార్కు ని చూపిస్తూ వచ్చారు కానీ ఒక్కరు మాత్రం తన విలనిజంతో జనాల అందరిని భయపెట్టారు ఆయన ఎవరు అంటే ప్రదీప్ రావత్.
ఈ పేరు చెప్తే చాలా మందికి తెలియక పోవచ్చు కానీ సై సినిమా లో భిక్షుయాదవ్ అంటే మాత్రం అందరికీ తెలుసు అలా ప్రదీప్ రావత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సాధించాడు.ఆయన మొదట్లో మోడల్ గా కూడా చేశారు ఆ తర్వాత బాలీవుడ్లో బుల్లి తెరపై వచ్చిన మహాభారతం లో అశ్వద్ధామ గా నటించాడు ఆ తర్వాత అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన లగాన్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసి జనాల అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఆ తర్వాత మురుగదాస్ డైరెక్షన్లో సూర్య హీరోగా తమిళ్ లో వచ్చిన గజిని సినిమా తో అటు తమిళ ఇటు తెలుగు రెండు భాషల్లో మంచి గుర్తింపు సాధించాడు.దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సై చిత్రంలో విలన్ పాత్ర వేసి ప్రేక్షకులందరినీ భయపెట్టి సినిమా అయిపోయిన తర్వాత కూడా గుర్తుండిపోయే విలన్ పాత్ర చేసి జనాల అందరి చేత తన నటనతో శభాష్ అనిపించుకున్నారు.
ఆ తర్వాత భద్ర, చత్రపతి, లక్ష్మి, స్టాలిన్, జై లవకుశ, జగడం, వన్ నేను ఒక్కడినే లాంటి సినిమాల్లో విలన్ గా చేసి తనకంటూ మంచి గుర్తింపు సాధించాడు.
రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన నేను శైలజ సినిమా లో కామెడీ చేసి ప్రదీప్ రావత్ విలనిజమే కాదు కామెడీ కూడా బాగా పండించగలడు అని నిరూపించుకున్నారు.
ప్రస్తుతం ఆయన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి గుర్తింపు పొందారు అలాగే ఈ మూడు భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నారు.ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించారు కానీ ఆ సినిమాలు రిలీజ్ కాలేదు అవి రిలీజ్ అయి ఉంటే ప్రదీప్ రావత్ హీరోగా కూడా మంచి పేరు తెచ్చుకునేవాడేమో.
అయితే ప్రదీప్ రావత్ ప్రస్తుతం స్టార్ స్టేటస్ ని అనుభవిస్తున్నారని చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే ప్రదీప్ రావత్ భార్య కళ్యాణి రావత్ కూడా మొదట్లో మోడలింగ్ చేస్తూ తర్వాత కొన్ని యాడ్ ఫిలిమ్స్ లో నటించారు.ప్రస్తుతం ఆమె బాలీవుడ్ బుల్లితెరపై కొన్ని సీరియల్స్ లో నటిస్తున్నారు.ఆవిడ చూడడానికి అచ్చం హీరోయిన్ల ఉంటారు అయితే విలన్ గా ప్రదీప్ రావత్ ని చూసిన జనాలు కళ్యాణి రావత్ ని ఆయన భార్య అంటే చాలామంది నమ్మడం లేదు ఎందుకంటే ఎప్పుడూ విలన్ వేషాలు వేస్తూ అందరినీ హింసించే వ్యక్తి అయిన ప్రదీప్ రావత్ కి హీరోయిన్ లాంటి అమ్మాయి భార్య అవడం ఏంటి అని అందరూ అనుకుంటున్నారు కానీ నిజానికి ప్రదీప్ రావత్ సినిమాల్లో చూపించినంత బ్యాడ్ గా నిజ జీవితంలో ప్రవర్తించరు ఆయన చాలా సున్నితమైన మనిషి ఎవరికీ ఏ హాని చేయరు వీలైతే ఆయన దగ్గరికి సాయం కోసం వస్తే తనకు తోచినంత సహాయం చేస్తారని చెప్తూ ఉంటారు.