మార్చి 7వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని పేర్కొన్నారు.
అంతమాత్రమే కాకుండా అదేరోజు దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు క్యూఆర్ కోడ్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు.ముఖ్యంగా ఆరోజు ఊహించని విధంగా మహిళలకు జగన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు.

అదేమిటంటే రాష్ట్రంలో మహిళా దినోత్సవం రోజున మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసే మహిళలకు పది శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు.ఇదే తరుణంలో మహిళా భద్రత సాధికారతపై షార్ట్ ఫిలిమ్స్ పోటీలు కూడా నిర్వహించాలని ఈ సమీక్ష సమావేశంలో నిర్ణయించారు.దిశా చట్టం విషయంలో మహిళలకు అవగాహన కల్పించే రీతిలో కాలేజీలో బహిరంగ ప్రదేశాలలో ప్రచార హోర్డింగులు ఏర్పాటు చేయాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి మహిళకు దిశ చట్టం పట్ల అవగాహన ఉండేవిధంగా ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు.
.