వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వలస వెళ్లి స్థిరపడిన భారతీయులు అక్కడి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.ఎన్నో దేశాలకు అధ్యక్షులుగా, ప్రధానులుగా, మంత్రులుగా, చట్టసభ సభ్యులుగా, మేయర్లుగా ఇలా ఉన్నత పదవులను అధిరోహిస్తున్నారు.
భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన కెనడా( Canada ) రాజకీయాల్లోనూ మనవారు ముఖ్య భూమిక పోషిస్తున్నారు.తాజాగా ఒంటారియో( Ontario ) ప్రావిన్స్ కీలకమైన ప్రాంతీయ ఎన్నికలకు సిద్ధమవుతోంది.
ఈ ఎన్నికల్లో దాదాపు 37 మంది భారత సంతతి అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు.గతంలో అత్యధికంగా 11 మంది ఇండో కెనడియన్ శాసనసభ్యులు ఒంటారియో ఎన్నికల్లో గెలిచారు.
ఈసారి ఈ రికార్డును బ్రేక్ చేయాలని భారతీయ కమ్యూనిటీ పట్టుదలతో ఉంది.
ప్రధానంగా డగ్ ఫోర్డ్ ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించిన ప్రభ్మీత్ సింగ్ సర్కారియ,( Prabhmeet Singh Sarkaria ) అమర్జిత్ సింగ్ సంధూ,( Amarjit Singh Sandhu ) హర్దీప్ గ్రెవాల్, నినా టాంగ్రీ, దీపక్ ఆనంద్ సహా ప్రస్తుత అసెంబ్లీలోని భారత సంతతికి చెందిన సభ్యులంతా మళ్లీ బరిలో నిలుస్తున్నారు.
ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ షాఫోలి కపూర్, టొరంటో ఏరియాలో గోల్ఫ్ కోర్సులు నిర్వహిస్తున్న వ్యాపారవేత్త రంజిత్ సింగ్ బగ్గాలు( Ranjit Singh Bagga ) తొలిసారిగా పోటీ చేస్తున్న అభ్యర్ధులలో ఉన్నారు.

ఒంటారియో రాజకీయాల్లో కొత్త పార్టీ అయిన న్యూబ్లూ పార్టీ నలుగురు భారత సంతతి అభ్యర్ధులను బరిలోకి దించగా.గ్రీన్ పార్టీ నలుగురిని పోటీకి పెట్టింది.ఫిబ్రవరి 27న జరిగిన ఎన్నికల ఫలితాలు తేలకపోవడంతో ఇండో కెనడియన్ కమ్యూనిటీ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఈసారి ఒంటారియో ప్రావిన్స్‌లో తన రాజకీయ ప్రాతినిథ్యాన్ని విస్తరించాలని ఆశిస్తోంది.

ఈ ప్రాంతీయ ఎన్నికలతో పాటు కెనడా ఫెడరల్ ప్రభుత్వ రాజకీయ ముఖ చిత్రం కూడా మారే సూచనలు కనిపిస్తున్నాయి.ట్రూడో రాజీనామాతో లిబరల్ పార్టీ తన తదుపరి ప్రధాని ఎన్నిక ప్రక్రియను ప్రారంభించింది.మార్చి 9న ఇందుకోసం ఎన్నికలు జరగనుండగా.
ఎంపీలు, పార్టీ ప్రతినిధుల మద్ధతు పొందేందుకు ఆరుగురు అభ్యర్ధులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.







