నాని( Nani ) హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్( The Paradise ) సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ విడుదల కాగా ఈ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.అయితే గ్లింప్స్ లో నాని లుక్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) నాని లుక్ వెనుక కొన్ని సీక్రెట్స్ ను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
గ్లింప్స్ లో నాని లుక్ వెనుక అసలు కారణాలను ఇప్పుడే వెల్లడించడం కరెక్ట్ కాదని ఆయన తెలిపారు.
కానీ ఒక విషయం మాత్రం చెప్పాలని అనుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు.నాని జడల వెనుక పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఒక ఎమోషన్ దాగి ఉందని నా చిన్నతనంలో మా అమ్మ కూడా నాకు అదే విధంగా జడలు వేసేదని తెలిపారు.
ఐదో తరగతి వరకు జుట్టు అల్లి స్కూల్ కు పంపేదని శ్రీకాంత్ అన్నారు.

ఈ లుక్ సినిమాకు ఎలా కనెక్ట్ అవుతుందనేది మాత్రం ఇప్పుడే చెప్పనని నాని ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే నటుడని శ్రీకాంత్ ఓదెల వెల్లడించడం గమనార్హం.దసరా సినిమాతో( Dasara ) నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో సక్సెస్ చేరిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డ్ చేరింది.
నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

నాని పారితోషికం 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.నాని భవిష్యత్తు సినిమాల బడ్జెట్లు 100 కోట్ల రూపాయలు క్రాస్ చేస్తున్నాయి.న్యాచురల్ స్టార్ నాని భవిష్యత్తు సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.








