ప్రతి శుక్రవారం రోజున థియేటర్లలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ కావడం సాధారణం కాగా అదే విధంగా అదే సమయంలో ఓటీటీలలో సైతం ఎక్కువ సినిమాలు విడుదల కానున్నాయి.పరీక్షల సమయం కావడంతో థియేటర్లలో ఎక్కువ సినిమాలు రిలీజ్ కాకపోయినా ఓటీటీలలో మాత్రం అద్భుతమైన సినిమాలు రిలీజ్ అవుతుండటం గమనార్హం.
ఈ సినిమాలకు ఓటీటీలలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.
నెట్ ఫ్లిక్స్ లో విడాయుముర్చి( Vidaamuyarchi ) ఈ నెల 3వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
థియేటర్ల విషయానికి వస్తే ఛావా తెలుగు వెర్షన్,( Chhaava Telugu Version ) ఆఫీసర్ ఆన్ డ్యూటీ, కింగ్ స్టన్ సినిమాలు రిలీజ్ కానున్నాయి.ఈ సినిమాలు డబ్బింగ్ సినిమాలు కాగా ఈ సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.
లైలా సినిమా( Laila ) అమెజాన్ ప్రైమ్, అహా ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుండగా శర్వానంద్ మనమే సినిమా( Manamey Movie ) కూడా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది.

మనమే సినిమా థియేటర్లలో విడుదలై చాలా కాలం కాగా ఒకింత ఆలస్యంగా ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుండటం గమనార్హం.హాట్ స్టార్ లో బాబు తెలుగు సినిమా స్ట్రీమింగ్ కానుంది.11 వెబ్ సిరీస్ లు ఈ వారం ఓటీటీలలో అందుబాటులోకి వస్తుండటం గమనార్హం.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఈ నెల 7వ తేదీన థియేటర్లలో రీరిలీజ్ అవుతుండటం గమనార్హం.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు( Seethamma Vakitlo Sirimalle Chettu ) సినిమాకు సంబంధించి 10 థియేటర్లు ఇప్పటికే హౌస్ ఫుల్ అయ్యాయి.ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుండటం గమనార్హం.
ప్రముఖ ఓటీటీలలో క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఓటీటీ ఫ్యాన్స్ కు పండగేనని చెప్పవచ్చు.







