టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో చాందిని చౌదరి( Chandini Chowdary ) ఒకరు అనే సంగతి తెలిసిందే.డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమాలో చాందిని చౌదరి కీలక పాత్రలో నటించి తన నటనతో మెప్పించారు.
సరైన ప్రాజెక్ట్స్ లో నటిస్తే చాందిని చౌదరి కెరీర్ పరంగా మరింత ఎదిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.కొంతమంది ఆకతాయిలు పెట్ ను చంపేయగా అలా చేయడం గురించి చాందిని చౌదరి ఎమోషనల్ అయ్యారు.
ప్రజలు ఇలాంటి వయొలెన్స్ ను ఎంకరేజ్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.దాని పర్యావసానాలు వాళ్లకు తెలియడం లేదని ఆమె చెప్పుకొచ్చారు.అసలు వాళ్లకైన వాళ్లేం చేస్తున్నారో తెలుస్తుందా అని చాందిని చౌదరి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.ఈ తరహా సైకో ఆలోచనలు, చేష్టలు సమాజానికి మంచిది కాదని ఆమె వెల్లడించారు.
అది చూస్తుంటే నా గుండె ముక్కలైందని అనిపిస్తోందని ఆమె తెలిపారు.

ఇలాంటి మూగ జీవుల గురించే మనం మాట్లాడాలని ఆమె పేర్కొన్నారు.మూగజీవులపై తనకు ఉన్న ప్రేమను ఆమె ఈ విధంగా చాటుకున్నారు.చాందిని చౌదరి చేసిన పోస్ట్ కు నెటిజన్ల నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ లభిస్తుండటం గమనార్హం.
చాందిని చౌదరి కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.చాందినిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చాందిని చౌదరి కెరీర్ పరంగా సత్తా చాటుతూ ఎదుగుతున్నారు.చాందిని చౌదరి తెలుగమ్మాయి కాగా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఆమె కెరీర్ ను మొదలుపెట్టారు.ఆమె నటించిన షార్ట్ ఫిల్మ్స్ కు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయనే సంగతి తెలిసిందే.చాందిని చౌదరికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.
చాందిని చౌదరి ఇతర భాషల్లో సైతం సక్సెస్ కావాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.







