రోజు ఉదయం చిటికెడు పసుపును ఇలా తీసుకుంటే బాన పొట్ట దెబ్బకు ఫ్లాట్ అవుతుంది!

ఇటీవల రోజుల్లో ఎంతో మంది బెల్లీ ఫ్యాట్ సమస్య( Belly Fat Problem )తో బాధపడుతున్నారు.స్త్రీలు మాత్రమే కాదు పురుషులు సైతం బాన పొట్టతో నానా అవస్థలు పడుతున్నారు.

 Effective Way To Lose Belly Fat With Turmeric!, Turmeric, Turmeric Benefits, Lat-TeluguStop.com

పొట్ట వద్ద కొవ్వు పేరుకు పోవడానికి కారణాలు అనేకం.గంటల తరబడి కూర్చుని ఉండడం, శరీరానికి శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి లో చోటు చేసుకున్న మార్పులు, ప్రెగ్నెన్సీ, పలు రకాల మందుల వాడకం, మద్యపానం, కంటి నిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి తదితర కారణాల వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య ఏర్పడుతుంది.

Telugu Belly Fat, Fat Cutter, Flat Stomach, Tips, Latest, Turmeric-Telugu Health

దీనిని నిర్లక్ష్యం చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు( Health Problems ) తలెత్తుతాయి.అందుకే పొట్టను తగ్గించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే రోజు ఉదయం చిటికెడు పసుపును ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మీ బాన పొట్ట దెబ్బకు ఫ్లాట్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం పసుపుతో పొట్ట కొవ్వును ఎలా కరిగించుకోవచ్చో తెలుసుకుందాం పదండి.

ఒక గ్లాస్ లో హాట్ వాటర్ తీసుకొని అందులో పావు టేబుల్ స్పూన్‌ పసుపు( Turmeric ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ లెమన్ జ్యూస్( Lemon Juice ), వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేయాలి.

ఈ వాటర్ ను రోజు ఉదయం ఖాళీ కడుపుతో సేవించాలి.ఇలా ప్రతిరోజు కనుక చేస్తే పసుపు, లెమన్ మరియు అల్లం లో ఉండే పలు సుగుణాలు పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును చాలా వేగంగా కనిపిస్తాయి.

Telugu Belly Fat, Fat Cutter, Flat Stomach, Tips, Latest, Turmeric-Telugu Health

బాన పొట్టను కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ గా మారుస్తాయి.కాబట్టి బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా పైన చెప్పిన టర్మరిక్ వాటర్ ను తీసుకోండి.పైగా ఈ వాటర్ ను రోజు తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.రోజంతా ఎంతో హుషారుగా ఉంటారు.మహిళల్లో నెలసరి సమస్యలు నయం అవుతాయి.

మరియు చర్మంపై మొటిమలు( Pimples ) రాకుండా ఉంటాయి.మచ్చలు ఏమైనా ఉంటే మాయం అవుతాయి.

క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube