భారత మీడియా సంస్థలకు చైనా నుంచి ఆర్ధిక సాయం

భారత్‌( India )ను అణిచివేసేందుకు చైనా( China ) అనేక మార్గాల్లో కుట్రలు చేస్తోంది.అనేక విధాలుగా భారత్‌కు నష్టం చేకూర్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

 Financial Assistance From China To Indian Media Organizations , India, China, F-TeluguStop.com

అందులో భాగంగా మీడియా, మేథావులను ఉపయోగించి కూడా భారత్ పై చైనా పన్నాగాలు పన్నుతోంది.మేధావులు, మీడియాకు ఆర్ధిక సహాయం చేస్తూ వారి ద్వారా భారత్ ను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

భారత్ లోని కొన్ని మీడియా సంస్థలను చైనా కంట్రోల్ చేస్తోంది.వాటికి నిధులకు సమకూర్చి చైనాకు అనుకూలంగా వార్తలు రాయిస్తోంది.

అలాగే మేధావులకు కూడా డబ్బులు ఇచ్చి అనుకూలంగా మార్చుకుంటోంది.

Telugu America, China, Financial, India, Japan, Latest-Telugu NRI

చైనాను వ్యతిరేకించే దేశాలను అణగదొక్కేందుకు ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలను అన్ని దేశాలు పసిగడుతున్నాయి.మీడియా సంస్థలు, జర్నలిస్టులకు డబ్బులు కుమ్మరించి తమకు అనుకూలంగా చైనా ప్రచారం చేయించుకుంటోందని అన్ని దేశాలు అనుమానిస్తున్నాయి.ఇటీవల యూరప్, అమెరికా, జపాన్( Japan ) లో చైనా వ్యవహారం బట్టబయలైంది.

అయితే భారత్ లోనూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఒక పద్దతి ప్రకారం చైనా ఇలాంటి కుట్రలు చేస్తోంది.

ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

Telugu America, China, Financial, India, Japan, Latest-Telugu NRI

భారత ప్రజాస్వామ్యానికి చైనా కుట్రలు ప్రమాదకరంగా మారాయని మేథావులు చెబుతున్నారు.తమ విస్తరణ వాదాన్నిప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చైనా ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు.మీడియా, మేథావుల ద్వారా ప్రజల ఆలోచనను మారుస్తుందని చెబుతున్నారు.

అన్ని దేశాల్లోనే బడా మీడియా సంస్థలు, ప్రముఖ మేధావులకు గాలం వేసి డబ్బులతో ఆశ పెడుతోంది.దీని వల్ల మీడియా, మేధావులను తమ గుప్పిట్లో పెట్టుకుంటోందని అంటున్నారు.

అయితే అన్ని దేశాలు దీనికి గమనిస్తున్నాయి. చైనా కుట్రలను భగ్నం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్నాయి.

నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుని చర్యలు చేపడుతున్నాయి.చైనా కుట్రలను తిప్పికొట్టకపోతే భారీ నష్టం జరిగే అవకాశముంటుందని భారతీయ మేథావులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube