ఆఫీస్ లో మధ్యాహ్నానికే నీరసం వస్తుందా.. అయితే ఇది తెలుసుకోండి!

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ప్రతి ఒక్కరి లైఫ్ ఉరుకులు పరుగులు గా మారింది.చాలా మంది సంపాద‌న‌పైనే దృష్టి పెడుతూ.

 Best Smoothie To Stay Away From Fatigue Throughout The Day! Smoothie, Mango Carr-TeluguStop.com

ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మానేస్తున్నారు. ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే ఏదో ఒకటి తింటున్నారు తప్పితే.

శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందించడంలో విఫలం అవుతున్నారు.ఇక ఎంతో మంది ఆఫీస్ లో ప‌ని చేస్తూ మధ్యాహ్నానికే నీరస పడిపోతుంటారు.

ఇందుకు కార‌ణం మీ శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే పోష‌కాలు అంద‌క‌పోవ‌డ‌మే.ఆ నీరసం కారణంగా చేసే పనిపై ఏకాగ్రత దెబ్బతింటుంది.

దీంతో డెడ్ లైన్స్ ను అందుకోలేకపోతుంటారు.మీ విషయంలోనూ ఇదే జరుగుతుందా.? అయితే ఖ‌చ్చితంగా మీ బ్రేక్ ఫాస్ట్ లో ఇప్పుడు చెప్పబోయే స్మూతీని చేర్చుకోవాల్సిందే.ఈ స్మూతీ మిమ్మల్ని రోజంతా ఎన‌ర్జిటిక్ గా ఉంచుతుంది.

అలాగే మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ అందిస్తుంది.మరి లేటెందుకు ఆ స్మూతీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Energetic Day, Fatigue, Tips, Latest, Mangocarrot, Smoothie-Telugu Health

ముందుగా ఒక క్యారెట్ ( Carrot )తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక మామిడిపండును తీసుకుని తొక్క చెక్కేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు మరియు మామిడిపండు ( Mango )ముక్కలు వేసుకోవాలి.అలాగే ఒక గ్లాసు కొబ్బరినీళ్లు మరియు చిటికెడు పసుపు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా మ్యాంగో క్యారెట్ స్మూతీ సిద్దమవుతుంది.

Telugu Energetic Day, Fatigue, Tips, Latest, Mangocarrot, Smoothie-Telugu Health

ఈ స్మూతీలో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ( Chia Seeds )మిక్స్ చేసి ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాలి.నిత్యం ఈ స్మూతీని తీసుకుంటే మీరు రోజంతా చాలా ఎనర్జిటిక్ గా, యాక్టివ్ గా ఉంటారు.నీరసం, అలసట వంటివి మీ దరిదాపుల్లోకి కూడా రావు.

పైగా ఈ స్మూతీ మీ శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలను అందిస్తుంది.మీ మెదడు పనితీరును రెట్టింపు చేస్తుంది.

కంటి చూపును పెంచుతుంది.గుండెపోటు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.

ఒత్తిడి డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు సైతం దూరం చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube