టాలీవుడ్ ఇండస్ట్రీలో వినాయక్( Vinayak ) కోన వెంకట్( Kona Venkat ) కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి.
కోన వెంకట్ నటుడిగా, నిర్మాతగా కూడా సత్తా చాటిన సంగతి తెలిసిందే.అయితే కోన వెంకట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అఖిల్ మొదటి సినిమా “అఖిల్”( Akhil Movie ) ఫ్లాప్ అవ్వడం గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
అఖిల్ సినిమా మొదలవ్వక ముందే ఈ కథతో సినిమా చేస్తే ఫ్లాప్ అవుతుందని వినాయక్ కు చెప్పానని కోన వెంకట్ తెలిపారు.వినాయక్ ను ఒప్పించడానికి చాలా ప్రయత్నించానని కోన వెంకట్ పేర్కొన్నారు.
వినాయక్ స్నేహితులతో సైతం నేను వద్దని చెప్పించే ప్రయత్నం అయితే చేశానని ఆయన వెల్లడించారు.ఆ సమయంలో వినాయక్ మాత్రం నన్ను నమ్మండి వర్కౌట్ అవుతుందని అన్నారని కోన వెంకట్ పేర్కొన్నారు.

వినాయక్ చాలా నమ్మకంగా ముందుకెళ్లారని ఆయన తెలిపారు.అయితే మనం ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఒక హిట్ సినిమాకు కారణం నమ్మకం అయితే ఒక ఫ్లాప్ సినిమాకు కారణం గుడ్డి నమ్మకం అని ఆయన కామెంట్లు చేశారు.నేను ఆ సినిమా డిజాస్టర్ అవుతుందని అంతకంటే గుడ్డిగా నమ్మానని కోన వెంకట్ పేర్కొన్నారు.

డైరెక్టర్ వినాయక్ తో పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా మంచి అనుబంధం ఉందని వినాయక్ ఎంతోమంది స్టార్స్ తో పని చేశారని ఆయన చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఒక సినిమా స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయని ఆ సినిమాతో వినాయక్ కచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతారని పేర్కొన్నారు.కోన వెంకట్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
వినాయక్ ఈ కామెంట్ల గురించి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.







