మన దేశంలో సూర్యగ్రహణం అయినా, చంద్రగ్రహణం అయినా ఏర్పడినప్పుడు దాదాపు అన్ని దేవాలయాలను మూసివేస్తారు.ఏ గ్రహణమైన ముగిసిన తర్వాతనే అన్ని ఆలయాల్లో సంప్రదాయబద్ధంగా పూజలు చేసి ఆలయం తెరుస్తూ ఉంటారు.
ఆ తర్వాత కూడా భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు.మన దేశవ్యాప్తంగా పాక్షిక చంద్ర గ్రహణం కారణంగా మూసివేసిన ప్రధాన ఆలయాలన్నీ గ్రహణం అయిపోయాక సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు చేసి తెరుస్తారు.
రాహు కేతువులకు నిలయమైన శ్రీకాళహస్తీవ్వరాలయంలో మాత్రం స్వామి అమ్మవార్లకు గ్రహణ కాలాభిషేకాలు చేసిన తర్వాతే గాని ఆలయాలని తెరవరు.
తిరుమల శ్రీవారి ఆలయంలో గ్రహణం మరుసటి రోజు రాత్రి 8.20 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం మొదలవుతుంది.ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉ.8.40 గంటలకు ఆలయం తలుపులు మూసివేశారు.రాత్రి 7.20 గంటలకు తెరిచారు.ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, రాత్రి కైంకర్యాలు చేసిన తర్వాతే ఆలయాన్ని తెరుస్తారు.అయితే గ్రహణం పూర్తయ్యే వరకు ఆలయంలోకి భక్తులను ఎవరిని అనుమతినివ్వరు.గ్రహణం పూర్తయిన తర్వాత రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు అన్న ప్రసాదం కూడా ప్రారంభిస్తారు.విశాఖ జిల్లా సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి పూజా కార్యక్రమాలు చేస్తారు.

ఇక్కడ బుధవారం ఉ.6.30 గంటల నుంచి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు.ఇక శ్రీశైల ఆలయంలో రాత్రి 8 గంటల నుంచి అలంకార దర్శనాన్ని మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుంది.
శ్రీకాళహస్తిలో ఆలయంలో మాత్రం గ్రహణ పూర్తయిన తర్వాత కాలాభిషేకాలు సందర్భంగా భక్తులు పోటెత్తారు.దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ మూతబడినప్పటికీ ఇక్కడి స్వామి అమ్మవార్లకు గ్రహణ కాలాభిషేకాలు చేస్తారు.దీంతో దేశం నలుమూలల నుంచి స్వామివారిని భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకోవడానికి వస్తారు.సహస్ర లింగం వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం శాంతి అభిషేకాలు జరిపిస్తారు.
రష్యా భక్తులు కూడా రాహు-కేతు పూజలు చేయించుకుని ఎంతో సంతోషంగా ఉంటారు.