ఈమద్య కాలంలో హీరోలు ఒక వైపు నటిస్తూనే మరో వైపు ప్రొడక్షన్‌లో అడుగు పెడుతున్నారు.నిర్మాణ రంగంలో సొంతంగా పెట్టుబడి పెట్టకున్నా కూడా ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి సినిమాలను నిర్మించడం లేదంటే సన్నిహితులతో కలిసి నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయడం వంటివి చేస్తున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు మూడు నాలుగు చేతులతో సంపాదిస్తున్నారు అనేందుకు పలువురు హీరోలు సాక్ష్యంగా నిలుస్తున్నారని చెప్పుకోవచ్చు.మహేష్‌బాబు సినిమాలు, నిర్మాణం, బిజినెస్‌లు, అంబాసిడర్‌గా రకరకాలుగా సంపాదిస్తున్న విషయం తెల్సిందే.

తాజాగా మహేష్‌బాబు థియేటర్ బిజినెస్‌లోకి అడుగు పెట్టిన విషయం తెల్సిందే.తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ముఖ్య నగరాల్లో మల్టీప్లెక్స్‌లను నిర్మించేందుకు ఏసియన్ సినిమాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.మహేష్‌బాబు ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక మల్టీప్లెక్స్‌ను సిద్దం చేశాడు.త్వరలోనే బెంగళూరులో కూడా నిర్మించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.ఇదే తరహా బిజినెస్‌లోకి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు పది థియేటర్లను కొనుగోలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.అంటే సరైన మెయింటెన్స్ లేక మూకు పడిపోయిన థియేటర్‌లను ప్రభాస్ టేకోవర్ చేసి, వాటిని మోడ్రన్‌మా మార్చి రన్ చేయించేందుకు సిద్దం అయ్యాడు.మొదటి దశలో పది థియేటర్లను తీసుకోవాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతుంది.
ప్రభాస్ ఇప్పటికే యూవీ క్రియేషన్స్‌లో భాగస్వామిగా ఉన్న విషయం తెల్సిందే.మరో వైపు మెల్ల మెల్లగా బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.
ప్రభాస్ కొత్త బిజినెస్‌లు మెల్ల మెల్లగా విస్తరిస్తున్నాడు.