యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ( Telugu film industry )ఇప్పటివరకు ఏ హీరోకి లేనంత గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్( Prabhas )… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.మారుతి ( Maruti )డైరెక్షన్ లో ఆయన చేస్తున్న రాజాసాబ్ సినిమా( Rajasaab movie ) తొందరలోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యంలో ఆయన చేయబోతున్న ఈ సినిమా కోసం భారీ కసరత్తులను చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరో వారం రోజులపాటు ఈ సినిమాకి తన డేట్స్ ని కేటాయించాల్సిన అవసరమైతే ఉందట.ప్రస్తుతం ఫౌజీ సినిమా( Fauji movie ) షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్ రాజాసాబ్ సినిమా కోసం డేట్స్ కేటాయించి ఈ సినిమాని పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత మళ్లీ ఫౌజీ సినిమా మీద తన ఫోకస్పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలందరు ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ప్రభాస్ మాత్రం వరుసగా పాన్ ఇండియా సినిమాలను చేసి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు.ఇక ఇప్పటివరకు పాన్ ఇండియాలో ఎక్కువ సినిమాలు చేసిన సౌత్ ఇండియన్ హీరోగా కూడా తను పెను రికార్డు లను సృష్టిస్తున్నాడు.ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే, ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన సాధించిన విజయాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి.

మరి దానికి అనుగుణం గానే మారుతీ సైతం ఈ సినిమాని తొందరగా ఫినిష్ చేసి రిలీజ్ చేసి తన తదుపరి సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలనే చూస్తున్నాడు…మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందా? లేదంటే ప్లాప్ అయి ప్రొడ్యూసర్స్ కి నష్టాలను మిగులుస్తుందా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.