కరోనా లాక్ డౌన్ తర్వాత ఓటీటీల( Ott ) వినియోగం ఊహించని స్థాయిలో పెరిగిందనే సంగతి తెలిసిందే.ప్రేక్షకులు సైతం ఓటీటీలలో సినిమాలను చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ వారం ఎక్కువ సంఖ్యలో సినిమాలు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా( Agent movie ) ఈ నెల 14వ తేదీన సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది.
అజయ్ దేవగణ్ నటించిన ఆజాద్( Azad ) ఈ నెల 14 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.అభిషేక్ బచ్చన్, ఇనాయత్ వర్మ నటించిన బీ హ్యాపీ( Be happy ) ఈ నెల 14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం.
బండి సరోజ్ కుమార్, శ్రుతి సమన్వి నటించిన పరాక్రమం( Parakramam ) ఈ నెల 14 నుండి ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.జియో హాట్ స్టార్ వేదికగా ఈ నెల 14 నుండి పోన్ మ్యాన్ ప్రసారం కానుంది.

అదే తేదీన జియో హాట్ స్టార్ లో మోనా2 ( Mona 2 )అనే యానిమేషన్ మూవీ సైతం ప్రసారం కానుందని తెలుస్తోంది.ఈ నెల 14న ఆహా ఓటీటీలో రేఖా చిత్రం స్ట్రీమింగ్ కానుందని భోగట్టా.బ్రహ్మా ఆనందం మూవీ కూడా అదే తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.రామం రాఘవం మూవీ ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్ కానుందని ఈటీవీ విన్, సన్ నెక్స్ట్ లలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది.

జియో హాట్ స్టార్ లో అనోరా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.ఈ సినిమాలతో పాటు మరికొన్ని హాలీవుడ్ సినిమాలు స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం.ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి మంచి లాభాలను సొంతం చేసుకున్నాయి.ఈ సినిమాలకు ఓటీటీలలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.