ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ లో ప్రతి ఒక్కరూ ఉపయోగించే యాప్ యూట్యూబ్( app is YouTube ) అనే సంగతి తెలిసిందే.అయితే యూట్యూబ్ ను తప్పు పనుల కోసం కొంతమంది వినియోగిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి.
అయితే ఈ మధ్య కాలంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం ద్వారా రన్యా రావు( Ranya Rao ) పేరు సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగిన సంగతి తెలిసిందే.దాదాపుగా 15 కిలోల బంగారాన్ని రన్యా రావు స్మగ్లింగ్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
అయితే స్మగ్లింగ్ చేయడానికి తాను యూట్యూబ్ పై ఆధారపడ్డానని రన్యా రావు చెబుతుండటం కొసమెరుపు. యూట్యూబ్ వీడియోల( YouTube videos ) ద్వారా స్మగ్లింగ్ పాఠాలను నేర్చుకున్నానని చెప్పి ఆమె అధికారులను సైతం ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు.
ఇదే తన తొలి స్మగ్లింగ్ అని రన్యారావు అధికారులకు వెల్లడించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

నాకు ఒక ఇంటర్నెట్ కాల్ వచ్చిందని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్( Dubai International Airport ) లోని టెర్మినల్3 గేట్ ఏకు వెళ్లాలని చెప్పారని అక్కడికి వెళ్లగా డైనింగ్ లాంజ్ లో ఒక వ్యక్తి 2 పార్శిల్స్ ను అందించాడని ఆమె చెప్పుకొచ్చారు.ఆ పార్శిల్స్ లో బంగారు కడ్డీలు ఉన్నాయని ఆమె వెల్లడించారు.ఎయిర్ పోర్ట్ బయట టేప్ కొనుక్కొని బిస్కెట్లను నడుము చుట్టూ అమర్చుకున్నానని ఆమె కామెంట్లు చేశారు.

వీఐపీ ప్రోటోకాల్ ( VIP protocol )లో భాగంగా సెక్యూరిటీ చెక్ లేకుండా బయటకు వెళ్లడానికి ఆమె ప్రయత్నించగా ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు.గత 6 నెలల్లో 27సార్లు దుబాయ్ కు వెళ్లిన రన్యా రావు ఇదే తన తొలి స్మగ్లింగ్ అని చెబుతుండటం గమనార్హం.రన్యా రావు ఈ కేసు నుంచి బయటపడతారో లేదో అనే చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.రన్యా రావు కెరీర్ ప్రమాదంలో పడినట్టేనని చెప్పవచ్చు.







