బన్నీ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా.. ఇండస్ట్రీ షేక్ అయ్యే బ్లాక్ బస్టర్ ఖాయమా?

పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్( Allu Arjun ).ఈ సినిమాతో బన్నీ క్రేజ్ మరింత పెరిగిన విషయం తెలిసిందే.

 Prashanth Neel To Direct Allu Arjun, Allu Arjun, Tollywood, Prashanth Neel, Dil-TeluguStop.com

ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు అన్న విషయం ఆసక్తికరంగా మారింది.ఇకపోతే గత కొద్దిరోజులుగా అట్లీ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.

ముందుగా అట్లీ దర్శకత్వంలో సినిమా ఉందని ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అదేవిధంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ ఒక సినిమా కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Allu Arjun, Dil Raju, Prashanth Neel, Prashanthneel, Tollywood-Movie

అయితే ఇప్పుడు అనూహ్యంగా ప్రశాంత్ నీల్ తో అల్లు అర్జున్ చేతులు కలిపే అవకాశముందనే వార్త సంచలనంగా మారింది.ప్రస్తుతం ఇదే వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.కాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గేమ్ చేంజర్ మూవీ కారణంగా ఊహించని విధంగా కోట్లలో కోల్పోయిన విషయం తెలిసిందే.ఈ సినిమా భారీగా కలెక్షన్లను సాధిస్తుందని నిర్మాత దిల్ రాజు భావించారు.

కానీ పరిస్థితి ఊహించని విధంగా మారిపోయింది.ఈ క్రమంలో దిల్ రాజుకి( Dil Raju ) అల్లు అర్జున్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

దిల్ రాజుతో బన్నీకి మంచి అనుబంధం ఉంది.

Telugu Allu Arjun, Dil Raju, Prashanth Neel, Prashanthneel, Tollywood-Movie

దిల్ రాజు బ్యానర్ లో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తానని అల్లు అర్జున్ చెప్పాడట.మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేస్తానని గతంలో మాట ఇచ్చి ఉన్నాడు.దాంతో బన్నీ నీల్ కాంబినేషన్ లో సినిమా చేయడానికి దిల్ రాజు సన్నాహాలు సిద్ధం చేస్తున్నాడట.

అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబో ప్రస్తుతం చర్చల దశలోనే ఉందని తెలుస్తోంది.ఈ కాంబో మూవీ మొదలు కావడానికి కనీసం మూడు నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందట.

అయితే ఇప్పటికే బన్నీ కొన్ని సినిమాలు కమిటై ఉన్నాడు.నీల్ కూడా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ చేస్తున్నాడు.

ఆ తర్వాత సలార్2 సినిమాతో పాటు రామ్ చరణ్, యశ్ ప్రాజెక్ట్ లు కూడా లైన్ లో ఉన్నాయి.కావున, బన్నీ, నీల్ మూవీ ఓకే అయినా.

పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుంది.అయితే వీరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడొచ్చినా సంచలనాలు సృష్టిస్తుందని చెప్పాలి.

అంతేకాకుండా ఆ సినిమా ఇండస్ట్రీ షేక్ అయ్యే బ్లాక్ బస్టర్ సినిమా అవడం ఖాయం అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube