అమ్మాయిలు చాలా మంది కనీసం నెలకు ఒకసారి అయినా పార్లర్ కు వెళ్లి ఫేషియల్, బ్లీచ్, టాన్ రిమూవల్ (Facial, bleach, tan removal)వంటివి చేయించుకుంటూ ఉంటారు.అందమైన మెరిసే చర్మం కోసం బ్యూటీ పార్లర్ లో భారీగా ఖర్చు పెడుతుంటారు.
కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీస్( home remedies) ను కనుక పాటిస్తే పార్లర్ గ్లోను ఇంట్లోనే ఈజీగా పొందవచ్చు.
అందుకోసం ముందుగా ముఖంపై ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఆపై ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టీ స్పూన్ షుగర్ పౌడర్(Teaspoon coffee powder, one teaspoon sugar powder) మరియు రెండు టేబుల్ స్పూన్లు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసి సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.
అనంతరం తడి క్లాత్ సహాయంతో చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
నెక్స్ట్ స్టెప్ ఫేస్ ప్యాక్.
ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ గోధుమపిండి, వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, వన్ టీ స్పూన్ కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.15 రోజులకు ఒకసారి ఈ రెండు రెమెడీస్ ను కనుక పాటిస్తే చర్మం పై పేరుకుపోయిన మురికి మృత కణాలు తొలగిపోతాయి.ఎండ వల్ల పాడైన స్కిన్ డీటాన్ అవుతుంది.అలాగే ఈ రెమెడీస్ చర్మాన్ని కాంతివంతంగా మెరిపిస్తాయి.మొండి మచ్చలకు చెక్ పెడతాయి.చర్మాన్ని మృదువుగా యవ్వనంగా మారుస్తాయి.
పార్లర్ గ్లోను మీ సొంతం చేస్తాయి.







