సౌదీ సర్కార్ సంచలన నిర్ణయం...వలస వాసులకు పండగలాంటి వార్త...!!

ప్రపంచ దేశాల నుంచీ అరబ్బు దేశాలకు ఎంతో మంది వలస వాసులు కార్మికులుగా వెళ్తుంటారు వీరిలో  భారత్ నుంచీ వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.అయితే అత్యధికశాతం మంది కార్మికులు అరబ్బు దేశాలలో యజమానుల కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.

 The Saudi Government's Sensational Decision For Immigrants Saudi Arabia, Immigra-TeluguStop.com

వీసా తీసుకున్నారనో, తాము  పని చేస్తున్న చోట యజమాని జీతం ఇవ్వడంలేదనో, ఇబ్బందులు పెడుతున్నాడనో ఇలా ఎన్నో సమస్యలు పడుతుంటారు.యజమాని చిత్ర హింసలు తట్టుకోలేక మరో చోట ఉద్యోగానికి వెళ్ళే అవకాశం లేక ఆత్మ హత్యలు చేసుకునే వారు ఎంతో మంది ఉంటారు.

అయితే ఇలాంటి సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ సౌదీ  ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

విదేశాల నుంచీ వలసలు వచ్చి ఇళ్ళలో పనిచేసే కార్మికులు ఇకపై ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని సులంభంగా వీసా కేటగిరిని మార్చుకుని నచ్చిన ఉద్యోగం చేసుకోవచ్చునని ప్రకటించింది.

త్వరలో ఈ నిభందన అమలులోకి రానుంది.ఇదిలాంటేప్రస్తుతం ఉన్న నిభంధనల ప్రకారం వలస కార్మికులు తమకు ఉద్యోగం నచ్చక పోయినా లేదంటే తమ సొంత దేశం వెళ్ళిపోవాలని అనుకున్నా తప్పనిసరిగా వారు పనిచేస్తున్న యజమాని అనుమతులు ఉండాల్సిందే దాంతో యజమాని అంగీకారం కోసం పడిగాపులు కాయాల్సి వచ్చేది అంతేకాదు అతడి అనుమతులు లేకపోతే ఇష్టం లేకపోయిన ఎన్ని కష్టాలు పడుతున్నా సరే అక్కడే  ఉండాల్సి వచ్చేది.

కానీ తాజా నిభంధనల ప్రకారం యజమాని ఇష్టం ఉన్నా లేకపోయినా వలస కార్మికుడికి ఉద్యోగం నచ్చకపోతే మరొక ఉద్యోగం లోకి మారిపోవచ్చు ఉండుకు జయమాని అనుమతులు అవసరం లేదు.అలాగే యజమాని జీతం చెల్లించని పక్షంలో ఉద్యోగం నుంచీ మారిపోవచ్చ, స్వదేశం తిరిగి వేల్లిపోవాలన్నా యజమాని అనుమతులు ఏ మాత్రం అవసరం లేదని స్పష్టం చేసింది.

సౌదీ తీసుకున్న తాజా నిర్ణయంతో సౌదీలోని వలస వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 

       

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube