ఇతర భాష ల్లో దుమ్ము రేపుతున్న స్టార్ హీరో లు సూపర్ స్టార్ లు తెలుగు మార్కెట్ వద్ద బొక్క బోర్లా పడుతున్నారు.తమిళ్ సూపర్ స్టార్ విజయ్ ఇప్పటికే తన సినిమా లతో బొక్క బోర్లా పడ్డాడు.
ఇటీవల వచ్చిన లియో సినిమా ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాట వందల కోట్ల వసూళ్లు నమోదు చేస్తూ ఉంటే తెలుగు లో మాత్రం ప్రమోషన్ ఖర్చులు అయినా వెనక్కి వచ్చాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సోషల్ మీడియా లో ఆయన లియో సినిమా ను ఓ రేంజ్ లో జనాలు ఏకి పారేస్తున్నారు.
ఇక మరో సూపర్ స్టార్ సినిమా కనీసం విడుదలకు కూడా నోచుకోవడం లేదు.కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తాజాగా ఘోస్ట్ సినిమా ను చేశాడు.

గత వారంలోనే ఆయన నటించిన శివ రాజ్ కుమార్ అక్కడ విడుదల అయింది.కానీ ఇక్కడ మాత్రం ఆ సినిమా విడుదలకు నోచుకోవడం లేదు.ఈ వారం లో శివ రాజ్ కుమార్ ఘోస్ట్ ని విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది.కానీ తెలుగు లో ఘోస్ట్ థియేట్రికల్ రిలీజ్ లేదా అనే అనుమానం కలిగించే విధంగా తెలుగు లో ఈ వారం కూడా విడుదల అవ్వడం లేదు.
వచ్చే వారం లో కూడా విడుదల అవ్వకుంటే డైరెక్ట్ గా ఓటీటీ లో చూడవచ్చు.అక్కడ మంచి వసూళ్లు నమోదు చేస్తున్న ఈ సినిమా కు సంబంధించి విడుదల తెలుగు బాక్సాఫీస్ ను ప్రభావితం చేయక పోవచ్చు అంటూ కొందరు అంటున్నారు.

అందుకే ఘోస్ట్ సినిమా ను తెలుగు లో విడుదల చేయడం కంటే డైరెక్ట్ గా ఓటీటీ ద్వారా విడుదల చేయాలని భావిస్తున్నారు.ఒక వేళ తెలుగు లో విడుదల అయితే ప్రమోషన్ ఖర్చు, థియేటర్ ఖర్చు లు కూడా వెనక్కి వచ్చే అవకాశం లేదు అని చాలా మంది అంటున్నారు.మంచి నిర్ణయం తీసుకున్నారు.ఓటీటీ లో అయినా త్వరగా విడుదల చేస్తే బాగుంటుంది అంటూ చాలా మంది శివ రాజ్ కుమార్ అభిమానులు ఘోస్ట్ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు.