వనిత విజయ్ కుమార్( Vanitha Vijay kumar ) పరిచయం అవసరం లేని పేరు.ఈమె ప్రముఖ నటుడు విజయ్ కుమార్ మంజుల కుమార్తెగా అందరికీ సుపరిచితమే.
ఇలా ప్రముఖ నటుడి కుమార్తె అయినటువంటి వనిత విజయ్ కుమార్ కూడా ఇండస్ట్రీలో కొనసాగారు.అయితే ఈమె తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలిచారు వనిత విజయ్ కుమార్ ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.
అయితే ఏ పెళ్లి( Marriage ) కూడా తనకు కలిసి రాకపోవడంతో ప్రస్తుతం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఒంటరిగా నివసిస్తున్నారు.
ఇక వివాదాలకు కేరఫ్ అడ్రస్ అయినటువంటి వనిత తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.తన ఇంట్లో జరుగుతున్నటువంటి పెళ్లి వేడుకకు తనని ఆహ్వానించలేదు అంటూ ఈమె సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.నటుడు విజయ్ కుమార్ కు ఇద్దరు భార్యలు తన పెద్ద భార్య కుమార్తె అనిత( Anitha ) కూతురు దియా( Diya ) వివాహ వేడుకలు ఇటీవల ఎంతో ఘనంగా జరిగాయి.
ఇక దియా వనిత విజయ్ కుమార్ కు కూతురితో సమానం.ఈ క్రమంలోనే ఈ పెళ్లి వేడుకలలో మొదటి భార్య ముగ్గురు పిల్లలు రెండో భార్య మంజుల ఇద్దరు పిల్లలు కూడా పాల్గొన్నారు.
ఇలా ఈ ఐదుగురు దియా పెళ్లి వేడుకలలో పెద్ద ఎత్తున సందడి చేశారు.హల్దీ, సంగీత్, మెహంది అంటూ అన్ని వేడుకలలో ఎంతో సంతోషంగా పాల్గొన్నారు.ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈ పెళ్లి వేడుకలకు( Marriage Celebrations ) మాత్రం వనిత విజయ్ కుమార్ కు ఆహ్వానం అందలేదు దీంతో ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనను తాను సింహంతో పోల్చుకున్న ఆమె. తాను నడుస్తున్న వీడియోను పోస్ట్ చేసింది.అంతే కాదు కుటుంబం నుంచి వేరయినా.
తన ఆత్మవిశ్వాసాన్ని ఎవరూ దెబ్బతీయలేరన్నట్టుగా ఆమె పోస్ట్ ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.