ప్రస్తుత రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ హెల్తీగా మరియు ఫిట్ గా ఉండాలని ఆరాటపడుతున్నారు.ఎందుకంటే ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం బాగుంటేనే ప్రశాంతత ఉంటుంది.
లేదంటే ప్రతి నిత్యం బాధపడుతూనే ఉండాలి.ఈ నేపథ్యంలోనే ఆరోగ్యమైన జీవితాన్ని గడిపేందుకు అందరూ మొగ్గు చూపుతున్నారు.
ఇకపోతే మిమ్మల్ని హెల్తీ గా ఫిట్ గా మార్చేందుకు మ్యాజికల్ జ్యూస్ ఒకటి ఉంది.ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా లేదా కనీసం వారానికి రెండు సార్లు కనుక తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.
జ్యూస్ తయారీ కోసం బ్లెండర్ తీసుకుని అందులో అర కప్పు పీల్ తొలగించి సన్నగా తరిగిన కీరా దోసకాయ ముక్కలు( Cucumber Slices ), అర కప్పు క్యారెట్ ముక్కలు( Carrot slices ), అర కప్పు బీట్ రూట్ ముక్కలు( Beet root slices ), పీల్ తొలగించిన ఒక ఆరెంజ్, పావు కప్పు క్యాబేజీ తురుము మరియు ఒక స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి.చివరిగా ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
ఇలా బ్లెండ్ చేసుకున్న జ్యూస్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని నిమ్మరసం కలిపి సేవించాలి.
రోజు ఉదయం ఈ మల్టీ వెజిటబుల్ జ్యూస్( Multi vegetable juice ) ను తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.బాడీ డీటాక్స్ అవుతుంది.కాలేయ పనితీరు మెరుగు పడుతుంది.
అలాగే ఈ జ్యూస్ లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.అందువల్ల ఇది రక్తహీనత సమస్యను తరిమి కొడుతుంది.
నీరసం, బలహీనత కు చెక్ పెడుతుంది.
అంతే కాకుండా ఈ మల్టీ వెజిటబుల్ జ్యూస్ వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.మెదడు చురుగ్గా పని చేసేలా ప్రోత్సహిస్తుంది.
వివిధ దీర్ఘకాలిక జబ్బుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.మరియు మీ చర్మాన్ని సూపర్ గ్లోయింగ్ గా మరియు బ్యూటిఫుల్ గా మెరిపిస్తుంది.