ఆ సీటు గెల్చుకోవడం అంత ఈజీ కాదు గురు .. టీడీపి ఏం చేస్తుందో ? 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన టిడిపి కూటమికి( TDP Alliance ) తిరుగే లేదన్నట్లుగా పరిస్థితి ఉన్నా.ఇప్పుడు మరో ఎన్నిక టిడిపికి పరీక్షగా మారింది.

 Tdp To Struggle For Victory In Visakha Local Body Mlc Elections Details, Tdp, Ch-TeluguStop.com

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి తమ పార్టీ అభ్యర్థిగా సీనియర్ పొలిటిషన్ బొత్స సత్యనారాయణ ను( Botsa Satyanarayana ) ప్రకటించింది.అయితే ఇక్కడ గెలుపు అవకాశాలు వైసీపీకి( YCP ) ఎక్కువగా ఉండడంతో , టిడిపి కూటమి టెన్షన్ పడుతోంది.

ఈ సీటును ఎట్టి పరిస్థితుల్లోనైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో టీడీపీ ఉంది.అయితే వైసిపి పై గెలిచే అవకాశాలు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉన్నాయి.

  వైసీపీకి ఉత్తరాంధ్రలో బలమైన నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ఉన్నారు.దీంతో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లు ఎక్కువమంది వైసీపీకి చెందిన వారే ఉండడంతో,  టిడిపి కూటమి బలం ఏ మాత్రం సరిపోని పరిస్థితి.

Telugu Ap, Ap Mlc, Chandrababu, Jagan, Janasena, Janasenani, Pavan Kalyan, Visak

స్థానిక సంస్థల విశాఖ ఎమ్మెల్సీ పదవి కాలం మూడేళ్లు.ఇక్కడ బలబలాలను లెక్కలు వేస్తే…  వైసిపికి 600 కు పైగా ఓట్లు ఉండగా, టిడిపికి కేవలం 250 మాత్రమే ఉన్నాయి.భారీ సంఖ్యలో వైసీపీ నుంచి చేరికలు ఉంటే తప్ప , టిడిపి కూటమి విజయం సాధించే పరిస్థితి లేదు.దీంతో వైసిపికి చెందిన ఎమ్మెల్సీ ఓటరను తమ వైపు తిప్పుకోవాలంటే ఇంత తక్కువ సమయంలో జరిగే పని కాదు.

పోనీ పదవులు మరో రకమైన ప్రలోభాలు పెట్టి వారిని చేర్చుకోవాలన్నా.  అక్కడ సీనియర్ నేతలు ఎవరికీ మంత్రి పదవులు దక్కలేదు.ఆర్థికంగా బలమైన నేతలు , సామాజికంగా పేరున్న వారు ఉన్నా. వారికి సరైన పదవులు లేకపోవడంతో వారు అంత చురుగ్గా ఈ వ్యవహారంలో పాల్గొంటారనేది అనుమానమే.

Telugu Ap, Ap Mlc, Chandrababu, Jagan, Janasena, Janasenani, Pavan Kalyan, Visak

టిడిపి నేతలను ఒక వైపు సమన్వయం చేసుకుంటూ,  మరోవైపు వైసీపీ ఓట్లను తమ వైపు తిప్పుకునే బలమైన నేతలు ఎవరు కనిపించకపోవడం,  టిడిపి కూటమికి ఇబ్బందికరంగా మారబోతుంది.  టిడిపి ఏపీ అధ్యక్షుడుగా పల్లా శ్రీనివాసరావు( Palla Srinivasarao ) ఉన్నా… మంత్రి అచ్చెన్న నాయుడుకు ఈ బాధ్యతలు అప్పగించినా ఆయనపై పార్టీ నేతల్లో ఉన్న వ్యతిరేకత ఎంతవరకు పనిచేస్తుందో చెప్పలేని పరిస్థితి.  దీంతో పాటు,  విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరుపున ఎవరిని ప్రకటిస్తారు అనేది తేలాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube