గ్రీన్ టీ( Green tea ).ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన పానీయాల్లో ఒకటి.
ఆరోగ్యపరంగా గ్రీన్ టీకు మరొకటి సాటి లేదు.గుండె జబ్బుల రిస్క్ ను తగ్గించడంలో, ఆరోగ్యమైన బరువు నిర్వహణలో, మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో, చర్మాన్ని యవ్వనంగా మెరిపించడంలో గ్రీన్ టీ అద్భుతంగా సహాయపడుతుంది.
అందుకే ఇటీవల కాలంలో చాలా మంది తమ రెగ్యులర్ డైట్ లో గ్రీన్ టీ ఉండేలా చూసుకుంటున్నారు.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు కేశ సంరక్షణకు సైతం గ్రీన్ టీ తోడ్పడుతుంది.
ముఖ్యంగా జుట్టు రాలడానికి కారణమయ్యే డైహైడ్రో టెస్టోస్టెరాన్( Dihydrotestosterone ) పెరుగుదలను గ్రీన్ టీ నిరోధిస్తుంది.హెయిర్ ఫాల్ కు సమర్థవంతంగా అడ్డుకట్ట వేస్తుంది.మరి ఇంతకీ హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టాలంటే గ్రీన్ టీను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక కప్పులో మరిగించిన వాటర్ ను తీసుకుని అందులో ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేసి పది నిమిషాల పాటు వదిలేయాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు మందారం పువ్వులు( Hibiscus flowers ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ నైట్ అంతా వాటర్ లో నానబెట్టుకున్న మెంతులు( fenugreek ) మరియు తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ టీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ గ్రీన్ టీ హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల జుట్టు రాలడం చాలా వేగంగా కంట్రోల్ అవుతుంది.గ్రీన్ టీ, మందారం మరియు మెంతుల్లో ఉండే పోషకాలు హెయిర్ రూట్స్ ని స్ట్రాంగ్ గా మారుస్తాయి.
హెయిర్ ఫాల్ ను రెడ్యూస్ చేస్తాయి.అలాగే ఈ గ్రీన్ టీ మాస్క్ జుట్టును ఆరోగ్యంగా షైనీ గా మెరిపిస్తుంది.
చుండ్రు సమస్య నుంచి సైతం విముక్తిని అందిస్తుంది.