గ్లామరస్ హీరోయిన్ గా తెలుగు సినిమా పరిశ్రమను ఓ ఊపు ఊపిన నటీమణి గీత.అప్పట్లో టాలీవుడ్ టాప్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది.
కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి సహా పలువురు అగ్రతారలతో కలిసి నటించింది.తెలుగు తెరపై వెలుగు వెలిగింది.
టాప్ నటిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది.నెమ్మదిగా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి.
అదే సమయంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పలు భాషల చిత్రాల్లో ఆమెకు ఆఫర్లు వచ్చాయి.ఆమె తన సినిమాలతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు సైతం దక్కించుకుంది.
మనదేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి సైతం ఆమె అవార్డులు అందుకున్నారు.ఇంతకీ తనకు ఏ దేశం నుంచి అవార్డు లభించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకరోజు మామూలుగా సినిమాల గురించి మాట్లాడుతూ ఉండగాచెన్నైలోని సౌత్ కొరియా కాన్సులేట్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది.ఆదేశ కాన్సులేట్ జనరల్ ఫోన్ లైన్ లో ఉన్నాడు.తాజాగా ఉత్తర కొరియాలో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది.ఇతర దేశాల సినిమాలతో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం తొలిసారి.
ఈ విదేశీ సినిమాల్లో భాగంగా ఇండియా నుంచి వచ్చిన మలయాళ సినిమా పంచాగ్నిని స్క్రీనింగ్ చేశాం.అందులో మీరు ఉత్తమ నటిగా ఎంపికయ్యారు అని వివరించాడు.ఈ అవార్డులను అందజేసేందుకు ఎలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయలేదు.ఈ వార్డును మీ ఇంటికే పంపిస్తున్నామని చెప్పాడు.కాల్ చేసిన కొద్ది రోజుల్లోనే ఆమెకు నార్త్ కొరియా నుంచి వెండి షీల్డ్, ప్రశంసా పత్రం ఇంటికి వచ్చాయి.

ఈ బహుమతిని చూసిన వెంటనే తను చాలా సంతోషంగా ఫీలయ్యింది. ఆమెకు ఉత్తమ నటిగా అవార్డు రావడం లేదు తొలిసారి.అదీ ఓ మలయాళ సినిమాకు గాను అంతర్జాతీయ అవార్డు రావడం మరింత సంతోషానికి గురి చేసింది.
గీత ఎన్నో సినిమాల్లో నటించినా అప్పటి వరకు తనకు ఎలాంటి అవార్డులు రాలేదు.వీటన్నింటికి మించి అంతర్జాతీయ అవార్డు రావడం పట్ల తనకు ఎంతో సంతోషం కలిగింది.
మనం గుర్తించలేని ఆమె నటనా స్థాయిన విదేశీయులు గుర్తించడం పట్ల ఆమె ఎంతో గర్వపడింది.ఈ అవార్డు వచ్చిన కొద్ది రోజుల తర్వాత కన్నడ సినిమా అరుణరాగకు కర్నాటక ప్రభుత్వం ఉత్తమనటి అవార్డు అందజేసింది.