అషు రెడ్డి సీక్రెట్ వీడియో బయటపెట్టిన యాంకర్ రవి.. ఏదో నడుస్తోంది అంటూ..?

ఇద్దరి సెలబ్రెటీల మధ్య ఏమైనా సాన్నిహిత్యం కనిపిస్తే చాలు వెంటనే వాళ్ళు హాట్ టాపిక్ గా మారాల్సిందే.లేదంటే నెటిజన్లు అస్సలు ఊరుకోరు.

 Anchor Ravi Shares Ashu Reddy Video Viral, Anchor Ravi, Ashu Reddy, Anchor Ravi-TeluguStop.com

ఎందుకంటే ఎప్పుడెప్పుడు సెలబ్రెటీల గుట్టు బయట పెట్టాలా అని చూస్తుంటారు.అలా వారి గురించి ఏదైనా లీక్ అవుతే వాటిని సోషల్ మీడియాలో వైరల్ గా చేసే వరకు నిద్రపోరని చెప్పాలి.

అలా ఇప్పటికి చాలా మంది సెలబ్రెటీలను హాట్ టాపిక్ గా మార్చారు.ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ రవిని, అషు రెడ్డిని కూడా అదేవిధంగా లాగారు ఓ నెటిజన్.

బుల్లితెరపై యాంకర్ గా అడుగుపెట్టి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ రవి గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో షో లలో యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అంతేకాకుండా వెండితెరపై కూడా పలు అవకాశాలు అందుకున్నాడు.కానీ యాంకర్ గానే మంచి పేరు సంపాదించుకున్నాడు.

కేవలం ఒక ఛానెల్ లోనే కాకుండా ప్రతి ఒక్క ఛానల్ లో యాంకరింగ్ చేశాడు రవి.

ఇప్పటికే ఎన్నో షో లను పూర్తి చేశాడు.ఇక ఇటీవలే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కూడా అడుగు పెట్టి కాస్త నెగిటివిటీ ని కూడా సంపాదించుకున్నాడు.హౌస్ నుండి బయటకు వచ్చాక మళ్లీ తన షోలతో బాగా బిజీ గా మారాడు.

ప్రస్తుతం తాను హ్యాపీడేస్ అనే షో లో బిజీగా ఉన్నాడు.బిగ్ బాస్ ముందు ఈ షోలో యాంకర్ గా చేసిన రవి మళ్లీ రీ ఎంట్రీ తో ఈ షో కి వచ్చాడు.

ఇందులో తనతో పాటు మరో బుల్లితెర ఆర్టిస్టు అషు రెడ్డి కూడా యాంకరింగ్ చేస్తోంది.అషు రెడ్డి గురించి కూడా బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.

ఈమె కూడా యాంకర్ గా, ఆర్టిస్టుగా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది.పైగా వెండితెరపై కూడా అవకాశం అందుకుంది.కానీ బుల్లితెర పైనే తనేంటో నిరూపించుకుంది.

అషు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిజానికి ఈమె సోషల్ మీడియా ద్వారానే సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంది.అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో కూడా పాల్గొని బాగా రచ్చరచ్చ చేసింది.

అలా తన పరిచయాన్ని పెంచుకొని సెలబ్రిటీలలో ఒకరిగా నిలిచింది.అంతేకాకుండా గతంలో రాహుల్ సిప్లిగంజ్ తో, ఎక్స్ ప్రెస్ హరి తో ప్రేమాయణం నడిపినట్లు పుకార్లు కూడా వచ్చాయి.

ఇక తాజాగా రవితో కలిసి షో చేస్తుండగా.రవితో కూడా సంబంధాలు పెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో బాగా టాక్ వినిపిస్తుంది.రవి.అషుకి సంబంధించిన ఫన్నీ వీడియోలు బాగా షేర్ చేసుకుంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే.తాజాగా అషు కు సంబంధించిన మరో ఫన్నీ వీడియో షేర్ చేయగా అందులో రవి ఇంత తొందరగా దొరికిపోతావు అనుకోలేదు అంటూ కామెంట్ చేశాడు.ఇక అందరూ ఈ కామెంట్ కు ఫన్నీగా స్పందించారు.

కానీ ఓ నెటిజన్ మాత్రం.వీరి మధ్య ఏదో నడుస్తుందని ఆలోచనలో పడేసాడు.

Anchor Ravi comedy on Ashu Reddy Video Viral Ashu Reddy

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube