విక్రమ్ ఈవెంట్ కి కమల్..!

కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో లోకనాయకుడు కమల్ హాసన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా విక్రం.ఈ సినిమాలో కమల్ తో పాటుగా విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ వంటి స్టార్స్ కూడా నటించారు.

 Kamal Hassan And Team Will Attend Vikram Telugu Event  Kamal Hassan , Vikram,  L-TeluguStop.com

జూన్ 3న రిలీజ్ అవుతున్న ఈ సినిమా తమిళ వర్షన్ తో పాటుగా తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.దాదాపు 400 సెంటర్స్ లో తెలుగు విక్రం రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.

ఇందుకోసం విక్రం టీం తెలుగులో కూడా ప్రమోషన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

కమల్ హాసన్ విక్రం సినిమాని తెలుగులో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు.ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట.

కమల్ హాసన్ తో పాటుగా మిగతా విక్రమ్ కాస్ట్ కూడా హైదరాబాద్ లో జరిగే ఈవెంట్ లో పాల్గొంటారని తెలుస్తుంది.కమల్ హాసన్ అంటే అభిమానం ఉన్న తెలుగు స్టార్స్ కూడా ఈ ఈవెంట్ లో అటెండ్ అవుతారని తెలుస్తుంది.

విక్రం తెలుగు ఈవెంట్ శ్రేష్ఠ్ మూవీస్ భారీగా ప్లాన్ చేస్తున్నారు.థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న విక్రం సినిమా ట్రైలర్ అదరగొట్టగా సినిమా తప్పకుండా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు.

ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం నితిన్ ఫాదర్ భారీ మొత్తం లో పెట్టారని ఫిల్మ్ నగర్ టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube