ఎన్టీఆర్ విగ్రహానికి ఇష్టమొచ్చిన రంగులు వేస్తామంటున్న కొడాలి నాని

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నటనలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ ఆయన మహానుభావుడు.

 Kodali Nani, Who Paints The Ntr Statue In Her Favorite Colors,  Andhra Pradesh,-TeluguStop.com

తెలుగుజాతి గురించి జాతీయ స్థాయిలో తెలిసేలా చేసిన మహానాయకుడు.తెలుగు దేశం పార్టీని స్థాపించి స్వల్ప కాలంలోనే అధికారం చేపట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఎన్టీఆర్ అమలు చేశారు.

అయితే ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ నాయకుడు కాదని వైసీపీ నేతలు హితబోధ చేస్తున్నారు.తాజాగా గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ రాజకీయ లొల్లి జరుగుతోంది.

ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ నేతలు తమ పార్టీ రంగులు వేయడంతో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు.

కానీ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని కొత్త పల్లవి అందుకున్నారు.

ఎన్టీఆర్ ప్రజా నాయకుడు అని.ఆయన టీడీపీకి చెందిన వ్యక్తి కాదంటూ వివరిస్తున్నారు.ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చంటున్నారు.ఎన్టీఆర్ విగ్రహానికి ఏ రంగులైనా వేసుకోవచ్చని కొడాలి నాని కొత్త భాష్యం చెప్పారు.అయితే కొడాలి నాని చెప్పిన దాంట్లో అర్థం పర్థం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్‌ను టీడీపీ వాళ్లు తమ వాడు అని అని టీడీపీ రంగులు వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఊరుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.

నిజానికి ఈ లోకాన్నే వదిలేసి దేహాన్నే త్యజించి వెళ్ళిపోయిన వారు అన్నింటికీ అతీతులు.అయితే వారి ఆనవాళ్లు, గుర్తులు ఈ భూమ్మీద ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి.వాటి మీద రాజకీయ నీడ పడకూడదు.కానీ ఇప్పుడు వైసీపీ వాళ్లు, టీడీపీ వాళ్లు తమ వాడు అని మాటల యుద్ధానికి తెరతీస్తే అది ఎన్టీఆర్‌కే అవమానం అని గ్రహించి తీరాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

కొడాలి నాని రాజకీయమంతా చంద్రబాబు మీదే చేసుకోవాలి తప్ప ఎన్టీఆర్ మీద ఎలా చేస్తారని నిలదీస్తున్నారు.

Telugu Andhra Pradesh, Chandrababu, Kodali Nani, Mahanadu, Ntr Statue, Ntrstatue

మరోవైపు తాను 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో గుడివాడలో తానే ఎమ్మెల్యేగా గెలిచానని.2024లో కూడా తనదే గెలుపు అని కొడాలి నాని ధీమా వ్యక్తం చేస్తున్నారు.చంద్రబాబు గుడివాడలో తనను ఓడిస్తానని తన చిన్నప్పటి నుంచి చెప్తున్నాడంటూ ఎద్దేవా చేశారు.2024 ఎన్నికల కోసం ముందు కుప్పంలో చంద్రబాబు గెలుస్తాడో లేదో చూసుకోవాలని హితవు పలుకుతున్నారు.చంద్రబాబుకు ప్రకృతి సహకరించదని.

ఆయన పిల్లను ఇచ్చిన మామకే వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు.ఎవరైనా చిన్న కర్మ చేసిన తర్వాత పెద్ద కర్మ చేస్తారని.

మహానాడు తర్వాత మినీ మహానాడు నిర్వహించడం చంద్రబాబు తెలివి తక్కువతనానికి నిదర్శనం అని కొడాలి నాని విమర్శలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube