తండ్రి ఔట్ కాగానే కుర్చీని కోపంతో త‌న్నేసిన డివిలియ‌ర్స్ కొడుకు..

తనయుడి విజయాన్ని చూసి తండ్రి చాలా ఆనందపడే సందర్భాలు మనం నిజజీవితంలో చాలా సార్లు చూసే ఉంటాం.అయితే, అలా కాకుండా తండ్రి విజయాన్ని చూసి తనయుడు ఆనందించడం ఇంకా బాగుంటుంది కదూ.

 De Villiers Son Angrily Shook His Chair When His Father Got Out In Ipl Match., D-TeluguStop.com

అలా తన తండ్రి ఏబీ డివిలియర్స్ విజయాన్ని చూసి ఆనందపడాలిన వచ్చాడు డివిలియర్స్ తనయుడు.కానీ, అలా జరగలేదు.

ఇంతకీ అసలేం జరిగిందంటే.

క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2021 రెండో సీజన్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఐపీఎల్ చూసేందుకు క్రికెట్ లవర్స్ టీవీలకు అతుక్కుపోతున్నారు.ప్రత్యక్షంగా స్టేడియంలో తమకు నచ్చిన క్రికెటర్ గేమ్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

తాజాగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకుగాను ఏబీ డివిలియర్స్ వైఫ్, సన్ వచ్చారు.కాగా ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి పాలైంది.

అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఈ మ్యాచ్‌లో పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోయాడు.ఈ క్రమంలోనే డివిలియర్స్ ఆటతీరుపై క్రికెట్ అభిమానులతో పాటు డివిలియర్స్ తనయుడు కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తున్న క్రమంలో జస్ ప్రీత్ బూమ్రా బౌలింగ్‌లో ఏబీ డివిలియర్స్ ఔట్ అవ్వగానే డివిలియర్స్ కొడుకు తట్టుకోలేకపోయాడు.స్టేడియంలో కూర్చున్న చోటనే కుర్చిని తన్ని చేతితో ముందర ఉన్న టేబుల్‌ను కొట్టాడు.దీనిని చూసి నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

తండ్రి ఔట్ అయితేనే తనయుడు తట్టుకోలేకపోతున్నాడని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, చాలా మంది తండ్రి కోసం తనయుడు అలా చేశాడని పోస్టులు పెడుతున్నారు.ఇటీవల కాలంలో డివిలియర్స్ పర్ఫార్మెన్స్ తగ్గిందని మరికొందరు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube