ప్రకాశం జిల్లా( prakasam district ) వెంకటాచలంపల్లిలో పెన్షన్ లబ్ధిదారులతో సీఎం జగన్( CM Jagan ) ముఖాముఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ గతంలో 39 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చేవారన్నారు.దీంతో అప్పటిలో నెలకు రూ.400 కోట్లు మాత్రమే ఖర్చయ్యేవని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ( Volunteer System ) తీసుకొచ్చామని చెప్పారు.వాలంటీర్లతో నేరుగా లబ్దిదారులకు పెన్షన్లు( Pensions ) అందిస్తున్నామన్న సీఎం జగన్ గ్రామ స్వరాజ్యం అంటే నిర్వచనం ఇచ్చామని తెలిపారు.
మ్యానిఫెస్టోను 99 శాతం అమలు చేశామని వెల్లడించారు.







