టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్( Star Hero Allu Arjun ) నేడు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.పుష్ప ది రూల్ సినిమాతో బన్నీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారనే సంగతి తెలిసిందే.
పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి బన్నీ పుట్టినరోజు( Allu Arjun Birthday ) సందర్భంగా టీజర్ విడుదలైంది.గంగమ్మ జాతరకు సంబంధించిన షాట్స్ తో మేకర్స్ ఈ టీజర్ ను రిలీజ్ చేయడం గమనార్హం.
టీజర్ ను చూసిన ప్రేక్షకులు టీజర్ లో బన్ని నట విశ్వరూపం చూపించారని కామెంట్లు చేస్తున్నారు.టీజర్ లో డైలాగ్స్ ఏం లేకపోయినా బన్నీ తన ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టారు.
అన్ని భాషలకు ఒకే టీజర్ ను రిలీజ్ చేయగా ఈ టీజర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని ఈ ఏడాది ఆగష్టు నెల 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని మేకర్స్ నుంచి మరోమారు క్లారిటీ వచ్చేసింది.
పుష్ప ది రూల్ టీజర్( Pushpa The Rule Teaser ) కు రికార్డ్ స్థాయిలో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి.అల్లు అర్జున్ బాక్సాఫీస్ ను సైతం రూల్ చేయబోతున్నాడని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.పుష్పరాజ్( Pushpa Raj ) అలా నడుస్తూ ఉంటే సోషల్ మీడియా అల్లకల్లోలం అవుతోందని ఫ్యాన్స్ చెబుతున్నారు.పుష్ప ది రూల్ విషయంలో సుకుమార్( Sukumar ) ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని బొమ్మ బ్లాక్ బస్టర్ అని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
టీజర్ లో బీజీఎం గూస్ బంప్స్( Pushpa BGM ) వచ్చేలా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.పుష్ప ది రూల్ తో బన్నీకి మరిన్ని అవార్డులు రావడం గ్యారంటీ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానుండగా బన్నీ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.