1.శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువా సమీపంలో సాంకేతిక లోపంతో గౌహతి ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది.దీంతో కొంతమంది ప్రయాణీకులు కిందికి దిగారు.వారు మరో ట్రాక్ పైకి వెళ్లగా ఆ సమయంలో అటుగా వెళ్తున్న మరో రైలు ఢీకొని ఆరుగురు మరణించారు.
2.అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పై వీహెచ్ కామెంట్స్
పంజాగుట్టలో తొలగించిన స్థానంలో అంబేద్కర్ విగ్రహం తిరిగి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు.
3.చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్ కు : కోమటి రెడ్డి
రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం నిలబడలేదని, చంద్రబాబు కు పట్టిన గతే తెలంగాణ సీఎం కేసీఆర్ కు పడుతుందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.
4.బిజెపి పదాధికారుల సమావేశం
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది.
5. వరి ధాన్యం కొనుగోలు అంశం పై రేవంత్ కామెంట్స్
వరి ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.ఈరోజు జరగబోయే తెలంగాణ క్యాబినెట్ సమావేశం ల వరి ధాన్యం కొనుగోలు అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.
6.ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ లో ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.ఎంపీ ఇంటి ముందు రైతులు ట్రాక్టర్లతో వరి ధాన్యం పారబోశారు.అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
7.రైలు ప్రమాద బాధితులకు జగన్ ఆర్ధిక సాయం
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరఫున రెండు లక్షల ఆర్థిక సహాయాన్ని జగన్ ప్రకటించారు.
8.పదవి పోయినందుకు బాధ లేదు : సుచరిత
మంత్రి పదవి పోయినందుకు తనకు ఎటువంటి బాధా లేదని మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.
9.శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కేంద్రం వద్ద తోపులాట
తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ జారీ కేంద్రం వద్ద భక్తుల మధ్య తోపులాట జరిగింది.గోవిందరాజ స్వామి సత్రాలు వద్ద జరిగిన తోపులాటలో ముగ్గురికి గాయాలయ్యాయి.
10.కొండరెడ్ల ను కలవడం ఆనందంగా ఉంది
కొండరెడ్ల ను వాళ్ల గ్రామం లో కలవడం ఎంతో ఆనందంగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళ సై అన్నారు.మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం లో గవర్నర్ పర్యటించారు.
11.తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైంది.
12.రాష్ట్రపతిని కలుస్తాం : మంద కష్ణ మాదిగ
దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.కెసిఆర్ రాజ్యాంగబద్ధ పాలన కాకుండా, రాచరిక పాలన కోరుకుంటున్నారని, రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని మందకృష్ణ మాదిగ తెలిపారు.
13.కెసిఆర్ కామెంట్స్ పై కోదండరామ్ విమర్శలు
రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు శోచనీయం అని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు.
14.కౌలు రైతుల కుటుంబాలకు జనసేన ఆర్థిక సహాయం
ఏపీ లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేస్తున్నారు.ఈమేరకు జనసేన కౌలు రైతులకు భరోసా యాత్రను మంగళవారం సత్యసాయి జిల్లాలో పవన్ ప్రారంభించారు.
15.పిన్నెల్లి రామకృష్ణ రెడ్డికి వైసిపీ బుజ్జగింపులు
మంత్రి పదవి దక్కలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో మాట్లాడాల్సిందిగా జగన్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
16.తిరుమల సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత
సర్వ దర్శనం టోకెన్లు జారీచేసి కేంద్రాల వద్ద తోపులాట చోటు చేసుకోవడంతో టోకెన్ జారీని తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది.
17.తిరుమలలో భక్తుల ఇబ్బందుల పై చంద్రబాబు ఆవేదన
తిరుమలలో సర్వదర్శనం టోకెన్ ల కోసం భక్తుల కష్టాలు పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.వేలాది మంది భక్తులు గంటల తరబడి బిడ్డలతో మండుటెండలో అవస్థలు పడుతుంటే టిటిడి ఏం చేస్తుందని బాబు ప్రశ్నించారు.
18.లోకేష్ కామెంట్స్
జగన్ పాలనలో గజానికో వైసిపి గాంధారి కొడుకు పుట్టుకొచ్చే మహిళలు వేధిస్తున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
19.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 796 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49000 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 53,450
.