మొదటిసారి అరుణాచలం వెళ్లాను.. చాలా అద్భుతంగా ఉంటుంది.. కిరణ్ అబ్బవరం ఏమన్నారంటే?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) గత ఏడాది క మూవీతో( Ka Movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

 Kiran Abbaravarm Shared His Experience About Temple Visit Recent Days Details, K-TeluguStop.com

ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు కిరణ్ అబ్బవరం.ఇప్పుడు మరొక మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు.

అయినా లేటెస్ట్ గా నటించిన చిత్రం దిల్ రూబా.( Dilruba Movie ) ఈ సినిమా మార్చి 14న గ్రాండ్గా విడుదల కానుంది.

ఈ సందర్భంగా మూవీ మేకర్ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.

Telugu Arunachalram, Dilruba, Kiran Abbavaram, Ka, Kiranabbavaram, Temple-Movie

ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాకు సంబంధించిన అనేక విషయాల గురించి పంచుకుంటున్నారు కిరణ్ అబ్బవరం.ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుణాచలం( Arunachalam ) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అరుణాచలం మొదటిసారి వెళ్లాను.చాగంటి వారి మాటలు వినేవాడిని.

ఇటీవల అనుకోకుండా కుదిరింది.అక్కడ నాకు చాలా పాజిటిల్ ఫీలింగ్ కలిగింది.

అక్కడ గిరి ప్రదక్షణ 14 కిలో మీటర్లు నడిచాము.

Telugu Arunachalram, Dilruba, Kiran Abbavaram, Ka, Kiranabbavaram, Temple-Movie

కానీ గిరి ప్రదక్షణ ఎప్పుడు చేయాలనేది తెలియదు.మార్నింగ్‌ 6కు మొదలు పెడదాం అనుకున్నాము.దర్శనం చేసుకున్నాకే గిరి ప్రదక్షణ చేయాలన్నారు.టిఫిన్ చేసిన ఎనిమిది గంటలకు బయలుదేరాము.14 కిలోమీటర్లు తిరిగి వచ్చేసరికి నాలుగు గంటలు పట్టింది.ఎండలో వెళ్లడంతో చుక్కలు కనిపించాయి.ఎవరైనా అరుణాచలం వెళ్లకపోతే ఇప్పుడైనా వెళ్లండి.చాలా అద్భుతంగా ఉంటుంది అని ఆయన అన్నారు.ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే కిరణ్ అబ్బవరం ఇటీవలే అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.తన మూవీ దిల్ రుబా కథేంటో చెబితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బైక్‌ను బహుమతిగా ఇస్తామని తెలిపారు.

బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు.ఇప్పటివరకు జరిగిన ప్రమోషన్లలో కథ గురించి తాము పలు హింట్స్ ఇచ్చామని వెల్లడించారు.

ఈ సినిమా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube