భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్( MEA S Jaishankar ) ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్ (ఇంగ్లాండ్) పర్యటనలో ఉన్నారు.
మార్చి 4న యూకేకు( UK ) వెళ్లిన జైశంకర్, ఈ పర్యటనలో మార్చి 9 వరకు అక్కడే ఉండనున్నారు.ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య అనేక కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
లండన్ విదేశాంగ శాఖ మంత్రితో ఇప్పటికే జైశంకర్ భేటీ అయ్యారు.ఇరుదేశాల మధ్య వాణిజ్య, వ్యూహాత్మక ఒప్పందాలు, విద్య, రాజకీయ అంశాలపై పలు పరస్పర ఒప్పందాలు కుదిరాయి.
భారత్ ప్రపంచంలో వృద్ధి, పాత్ర వంటి అంశాలపై కూడా జైశంకర్ లండన్‌లో( London ) జరిగిన సమావేశంలో మాట్లాడారు.

అయితే, జైశంకర్ లండన్‌లోని ఛార్మ్ హౌస్‌లో( Charm House ) తన సమావేశాన్ని ముగించుకుని బయటకు వస్తుండగా.ఖలీస్థానీ మద్దతుదారులు( Khalistani Supporters ) భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు.భారత్ పతాకాన్ని అవమానించేలా ప్రవర్తించారు.
అంతేకాకుండా, జైశంకర్ కూర్చున్న కారుపై దాడికి కూడా యత్నించారు.ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
వెంటనే లండన్ పోలీసులు స్పందించి, ఖలీస్థానీ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు.ఈ సంఘటనతో జైశంకర్ కూడా షాక్‌కు గురయ్యారు.

ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.ఈ ఘటన భారతదేశం, యూకే మధ్య సంబంధాలపై ఏవిధంగా ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.ఇదివరకు కూడా అనేక సందర్భాలలో ఖలీస్థానీ మద్దతుదారులు పెద్ద గొడవలు సృష్టించారు.అనేకమంది భారతీయులపై దాడి చేసిన సంఘటనలు కూడా ఇదివరకు చాలానే చూసాము మనం.ఇప్పుడు ఆ హింస కాస్త హద్దు దాటి ఏకంగా భారత విదేశాంగ మంత్రిపై దాడికి ప్రయత్నించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.







