తాగునీటితో బైక్ కడుగుతూ అడ్డంగా బుక్కైన హైదరాబాదీ.. చుక్కలు చూపించిన అధికారులు!

హైదరాబాద్‌లో( Hyderabad ) తాగునీటిని వృథా చేస్తే కఠిన శిక్షలు తప్పవు.జూబ్లీహిల్స్‌లో( Jubilee Hills ) ఓ వ్యక్తి బైక్ కడుగుతూ అడ్డంగా బుక్కయ్యాడు.

 Hyderabad Man Fined Rs 1000 For Washing Bike With Drinking Water Video Viral Det-TeluguStop.com

మంచి నీటిని( Drinking Water ) వృథా చేస్తున్నందుకు ఏకంగా వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాల్సి వచ్చింది.హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.

పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్‌కు వెళ్తుండగా రోడ్డుపై నీరు వృథాగా పోతుండటం చూసి షాక్ అయ్యారు.

లీకేజీ అనుకుని వెంటనే సిబ్బందిని పంపించి చెక్ చేయించారు.తీరా చూస్తే ఓ వ్యక్తి గ్యాంగ్ లీడర్ లాగా కూల్ గా తాగునీటితో బైక్ కడుగుతూ( Washing Bike ) కనిపించాడు.అంతే, అక్కడికక్కడే వెయ్యి రూపాయలు ఫైన్ వేశారు.

ఇది చూసి అశోక్ రెడ్డి సీరియస్ అయ్యారు.తాగునీటిని ఇలా వృథా చేస్తే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ప్రజలకు మంచి నీటిని ఇవ్వడానికి వాటర్ బోర్డు ఎంత కష్టపడుతుందో వివరించారు.పైసలు పెట్టి కొని తెచ్చి శుద్ధి చేసి ఇస్తున్న నీటిని బండ్లు కడగడానికి, మొక్కలు పెట్టడానికి వాడటం ఏంటని ఫైర్ అయ్యారు.

సిటీలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతున్నాయని, ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.నీటి కష్టాలు తప్పవని హెచ్చరించారు.

అందుకే అందరూ నీటిని పొదుపుగా వాడాలని కోరుతున్నారు.

ప్రస్తుతం రోజుకు 550 మిలియన్ గ్యాలన్ల నీటిని 13.7 లక్షల కనెక్షన్లకు సరఫరా చేస్తున్నామని, ఒక్క కిలోలీటరు నీటిని శుద్ధి చేసి అందించడానికి 48 రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు.నీటి చుక్క విలువైనదని, వృథా చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇంకా ఎవరైనా తాగునీటిని వృథా చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.దయచేసి నీటిని పొదుపుగా వాడండి, లేదంటే మీ పర్స్ ఖాళీ అవుతుందని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube