మిస్సమ్మ.తెలుగు సినిమా చరిత్రలో ఓ మాణిక్యంగా నిలిచిపోయిన చిత్రం.ఈ సినిమా అప్పుడే కాదు.ఇప్పటి పరిస్థితులకూ అద్దం పట్టినట్లు ఉంటుంది.ఆ రోజుల్లో ఇంత ముందు చూపుతో ఈ సినిమా కథ ఎలా రాశారు అని ఆలోచిస్తే ఆశ్చర్యం కలగకమానదు.అయితే ఈ సినిమా కథ విషయంలో పలు వివాదాలు జరిగాయి.ఇంతకీ ఆ వివాదాలకు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1955 సమయంలో తెలుగు సినిమా పరిశ్రమను నాగిరెడ్డి, చక్రపాణి ఏలుతున్నారు.అదే సమయంలో చక్రపాణి రచనల విషయంలో విమర్శులు బాగా వచ్చేవి.అంతేకాదు.తనే సినిమా పరిశ్రమను ముందుకు తీసుకెళ్తున్నట్లు ఫీలయ్యేలా స్టోరీలు రాసే వాడు.ఈతీరుపై పలువురు విమర్శలు చేసేవారు.
అంతేకాదు.తను ఓ కథ రాస్తే దాన్ని సినిమా చేయాల్సిందే అని పట్టుబట్టి కూర్చునేవాడు.
మిస్సమ్మ కథ విషయంలో సేమ్ ఇలాంటి పరిస్థితే కొనసాగింది.ఆయన రాసిన కథను చూసి చాలా మంది పలు విమర్శలు చేశారు.50 ఏండ్ల క్రితం సినిమా కథలా కాకుండా.పూర్తి భిన్నంగా ఈ కథ ఉంటుంది.
ఓ పెళ్లికాని అమ్మాయి పూర్తి పరిచయం లేని ఓ అబ్బాయిని నమ్మ అతడి భార్యగా వెళ్లేందుకు రెడీ అవుతుంది.ఆ అబ్బాయికి వేరే భార్య కూడా ఉంటుంది.

ఇదే పాయింట్ తో క్లాసిక్ సినిమాను తెర కెక్కించాడు చక్రపాణి.నిజానికి నిర్మాత నాగిరెడ్డికి మిస్సమ్మ సినిమా మీద ఎలాంటి నమ్మకం లేదు.ఇలాంటి కథతో సినిమా చేస్తే అట్టర్ ఫ్లాప్ ఖాయం అనుకున్నాడు.కానీ చక్రపాణి స్నేహం కోసం కాదనలేకపోయాడు.ఈ సినిమా నిర్మాణంలో తనూ భాగస్వామి అయ్యాడు.మొత్తంగా ఈ సినిమాపై ఎలాంటి నమ్మకం లేకుండా రిలీజ్ అయ్యింది.
రిలీజ్ కావడానికి ముందు కూడా చాలా ఆలోచించారు.ఈ సినిమా ఆడదు పక్కన పెట్టాలని సూచించారు కూడా.
అయినా వినకుండా చక్రపాణి విడుదల చేశాడు.ఈ సినిమా కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది.
క్లాసిక్ సినిమాగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.