చైనాతో ఎలాంటి లింక్స్ లేవు.. కోర్టులో అమెరికా ఆరోపణలపై మండిపడ్డ టిక్‌టాక్..

అమెరికాలో షార్ట్ వీడియో( Short video in America ) షేరింగ్ అప్లికేషన్ టిక్‌టాక్ చాలా ఫేమస్ అయ్యింది.ఈ యాప్‌ని చైనా దేశానికి చెందిన బైట్‌డ్యాన్స్ అనే కంపెనీ డెవలప్ చేసింది.

 There Are No Links With China, Tik Tok Is Angry At America's Accusations In The-TeluguStop.com

అయితే అమెరికా ప్రభుత్వం ఈ అప్లికేషన్ యూజర్ల భద్రత గురించి ఆందోళన చెందుతోంది.చైనా ( China )ప్రభుత్వం టిక్‌టాక్‌ని వాడుకుని అమెరికా ప్రజల గురించి రహస్యంగా తెలుసుకుంటుందని ఆరోపిస్తోంది.

అంటే, యూఎస్ యూజర్లు టిక్‌టాక్‌లో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ చైనా వాళ్ళకు తెలుస్తాయని అమెరికా ఆరోపిస్తోంది.దీనివల్ల అమెరికా దేశానికి ప్రమాదం ఉందని యూఎస్ గవర్నమెంట్ భావిస్తోంది.

అందుకే టిక్‌టాక్‌ని అమెరికాలో నిషేధించాలని ప్రయత్నిస్తోంది.

టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్( Bytedance ) మాత్రం అమెరికా ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని తీవ్రస్థాయిలో మండిపడుతోంది.

చైనా ప్రభుత్వం తమ యాప్‌ని వాడుకుని అమెరికా ప్రజల గురించి ఏమీ తెలుసుకోలేదని, అసలు ప్రజలకు అంత ప్రమాదం లేదని చెప్తుంది.ఇప్పుడు ఈ విషయంపై కోర్టులో విచారణ జరుగుతుంది.

బైట్‌డ్యాన్స్ తమ యాప్‌ టిక్‌టాక్‌ని అమెరికాలో వ్యాన్ చేయవద్దని కోరుతుంది.రీసెంట్ కోర్టు అప్పీల్‌లో యూఎస్ చేస్తున్న ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడింది.

Telugu American, Ban, Battle, Nri, Short, Links China, Tiktok-Telugu NRI

అమెరికా ప్రభుత్వం మాత్రం టిక్‌టాక్‌ని అమెరికాలో ఉన్న మరొక కంపెనీకి అమ్మేయాలని లేదా ప్రైవసీ నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని అమెరికాలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తోంది. యాప్ కంటెంట్ రికమండేషన్ ఇంజన్, యూజర్ డేటా అంతా ఒరాకిల్ నడుపుతున్న యూఎస్ క్లౌడ్ సర్వర్‌లలో స్టోర్ అవుతుందని కూడా టిక్‌టాక్ గురువారం పేర్కొంది.S.యూజర్లను ప్రభావితం చేసే కంటెంట్ మోడరేషన్ కూడా U.S.లోనే హ్యాండిల్ చేయడం జరుగుతుందని చెప్పుకొచ్చింది.

Telugu American, Ban, Battle, Nri, Short, Links China, Tiktok-Telugu NRI

ఏప్రిల్ 24న అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) సంతకం చేసిన చట్టం, టిక్‌టాక్‌ని విక్రయించడానికి బైట్‌డాన్స్‌కు జనవరి 19 వరకు గడువు ఇచ్చింది.లేకపోతే, యాప్‌ను నిషేధించవచ్చు.

జాతీయ భద్రతా సమస్యల కారణంగా టిక్‌టాక్ చైనీస్ యాజమాన్యాన్ని ముగించాలనుకుంటున్నామని వైట్ హౌస్ వివరించింది, అయితే యాప్‌ను పూర్తిగా నిషేధించడం తమ లక్ష్యం కాదని పేర్కొంది.నవంబర్ 5 అధ్యక్ష ఎన్నికలకు కొద్ది వారాల ముందు అంటే సెప్టెంబర్ 16న అప్పీల్ కోర్టు టిక్‌టాక్ భవిష్యత్తు గురించి వాదనలను వింటుంది.

మరి ఈ కేసులో యూఎస్ గవర్నమెంట్ గెలుస్తుందో లేదంటే బైట్‌డాన్స్‌ విజయం సాధిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube