జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను ఫన్నీగా ఇమిటేట్ చేసిన స్కూల్‌గర్ల్.. వీడియో వైరల్..

సెలబ్రిటీలను( Celebrities ) ఇమిటేట్ చేయడం కొత్తేం కాదు.కానీ కొంతమందిని ఇమిటేట్ చేయడం చాలా కష్టం.

 A Schoolgirl's Video Of A Funny Imitation Of Jasprit Bumrah's Bowling Action Has-TeluguStop.com

ఎందుకంటే వారి స్టైల్ అనేది చాలా క్లిష్టంగా ఉంటుంది.ఉదాహరణకి టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah )బోరింగ్ చాలా వెరైటీగా ఉంటుంది.

అతడి లాగా బౌల్ చేయడం ఎవరికీ కుదరని పని అని చాలామంది అంటారు.కానీ ఓ స్కూల్ గర్ల్ మాత్రం తన బౌలింగ్ యాక్షన్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆమె ఇండియన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లాగే బౌలింగ్ చేసింది.బుమ్రా బౌలింగ్ చేసే విధానం చాలా ప్రత్యేకమైనది, దాన్ని అలాగే అనుకరించడం చాలా కష్టం.2016లో తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్( International match ) ఆడినప్పటి నుంచి బుమ్రా ప్రత్యేకమైన బౌలింగ్‌తో వరల్డ్ క్రికెట్‌లో ఒక స్టార్‌గా మారాడు.

ఇండియా క్రికెట్ జట్టులో చాలా ముఖ్యమైన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.అతను వేగంగా బంతిని విసిరి, అది బ్యాట్స్‌మన్( Batsman ) కాలి దగ్గరే పడేలా చేయడంలో చాలా నేర్పరి.దీన్నే లీథల్ యార్కర్( Lethal yorker ) అంటారు.

అలాగే, బంతిని విసిరే విధానంలో చాలా రకరకాల మార్పులు చేస్తాడు.అతని వేరియేషన్స్ చూసి చాలామంది ప్రేరణ పొందుతున్నారు.

కొంతమంది అతనిలాగే బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఒక పాఠశాల బాలిక బుమ్రాలాగే చాలా ఖచ్చితంగా బౌలింగ్ చేయడం మనం చూడవచ్చు.ఈ బాలిక ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఫుల్ ఫేమస్ అయ్యింది.బుమ్రా బౌలింగ్ చేసే విధానం చాలా కష్టమైనప్పటికీ, ఈ అమ్మాయి తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచింది.“బుమ్రా లాగే బౌలింగ్ చేసే ఈ అమ్మాయిని చూశారా? చాలా అద్భుతం కదా!” అని ఈ వీడియో చూసిన వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ బాలికకు క్రికెటర్ గా మంచి భవిష్యత్తు ఉందని చాలామంది కామెంట్ చేశారు.

ఇండియన్‌ ఉమెన్స్ క్రికెట్‌ టీమ్‌లో మంచి బౌలర్‌గా ఆమె రాణించవచ్చు అని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube