బంగ్లాదేశ్‌లో( Bangladesh ) ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.మౌలానా షఫీక్-ఉర్-రహ్మాన్( Maulana Shafiq-ur-Rahman ) బాలురలను ముద్దు పెట్టుకుంటూ వీడియోలో చిక్కడంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.ఇంతకీ ఎవరీ మౌలానా? ఎందుకు ఈ వీడియో ఇంతలా దుమారం రేపుతోంది?
షఫీక్-ఉర్-రహ్మాన్ బంగ్లాదేశ్‌లోని ప్రముఖ రాజకీయ పార్టీ అయిన జమాత్-ఎ-ఇస్లామీకి( Jamaat-e-Islami ) చీఫ్‌గా ఉన్నారు.మత పెద్దగా సమాజంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది.అలాంటి వ్యక్తి అబ్బాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వైరల్ వీడియోలో( Viral Video ) షఫీక్-ఉర్-రహ్మాన్ కొందరు పిల్లలతో టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు.ఒక్కొక్క పిల్లాడి దగ్గరికి వెళ్లి బుగ్గలు, పెదవులపై ముద్దులు పెడుతున్నారు.కొందరు పిల్లలు అసౌకర్యంగా, భయంగా కనిపిస్తున్నారు.ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.
యూసుఫ్ ఖాన్ అనే వ్యక్తి ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తూ మౌలానా చర్యలను తీవ్రంగా ఖండించారు.ఇది బాలల లైంగిక వేధింపుల కిందకు వస్తుందని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పిల్లలు భయపడుతున్నారని, ఈ విషయాన్ని తేలికగా తీసుకోవద్దని ఆయన అన్నారు.

ఈ వీడియోపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది.మత పెద్ద హోదాలో ఉన్న షఫీక్-ఉర్-రహ్మాన్ చిన్న పిల్లలతో అలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
మౌలానా పలుకుబడి ముందు పిల్లలు తమ అసౌకర్యాన్ని వ్యక్తం చేయలేకపోయారని విమర్శకులు అంటున్నారు.
ఇదిలా ఉంటే, షఫీక్-ఉర్-రహ్మాన్ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా తెరపైకి వస్తున్నాయి.
గతంలో ప్రధాని షేక్ హసీనాను పదవి నుంచి తొలగిస్తే ముద్దు పెట్టుకుంటానని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.ఇప్పుడు చిన్నారుల వీడియోతో ఆ పాత వివాదం కూడా మళ్లీ రాజుకుంది.
మొత్తానికి మౌలానా షఫీక్-ఉర్-రహ్మాన్ వ్యవహారం బంగ్లాదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ కథనంలో వైరల్ అవుతున్న వీడియో వాస్తవికతను తెలుగు స్టాప్ స్వతంత్రంగా ధృవీకరించలేదని గమనించగలరు.







