సూర్యాపేట జిల్లా:మునగాల మండలం మాధవరం గ్రామంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం( Road accident )లో నేలమర్రి గ్రామానికి చెందిన రాంపంగు సురేష్(20) (Rampangu Suresh )అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు.పెళ్లి చూపుల కోసమని తన ద్విచక్ర వాహనంపై నెలమర్రి నుండి సూర్యాపేటకు బయలుదేరగా 65 వ,జాతీయ రహదారిపై మాధవరం వద్ద సూర్యాపేట నుంచి వస్తున్న టిప్పర్ ఢీ కొట్టడంతో మృతి చెందాడు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.మృతుడు సురేష్ సుతారి పని చేస్తాడని సమాచారం.