భారతదేశంలో పద్మ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు.వివిధ రంగాలలో ఉత్తమ సేవలను కనబరిచిన వారికి ప్రతి ఏడాది ఇలా పద్మ అవార్డులను(Padma Awards) కేంద్ర ప్రభుత్వం అందజేస్తూ ఉంటుంది.
ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది సెలబ్రిటీలకు పద్మ అవార్డులతో గౌరవించిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)పద్మ అవార్డుల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

రాజేంద్రప్రసాద్ త్వరలోనే నితిన్ (Nithin)హీరోగా నటించిన రాబిన్ హుడ్ (Robbin Hud)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్ కు పద్మ అవార్డుల గురించి ఒక ప్రశ్న ఎదురయింది.ఎన్నో సినిమాలలో తన కామెడీతో మెప్పించిన ఈయనకు ఇప్పటివరకు పద్మశ్రీ (Padma Sree)పురస్కారం మాత్రం రాలేదు దీంతో ఆయనకు పద్మశ్రీ ఎందుకు రాలేదు అని ప్రశ్న ఎదురైంది.

ఈ ప్రశ్నకు రాజేంద్రప్రసాద్ సమాధానం చెబుతూ.పద్మశ్రీ అవార్డులు రాజకీయాలతో ముడి పడి ఉన్నాయి.మనం వెళ్లి ఎవర్నో అడగాలి.లేదా రాజకీయాలు చేయాలి.మనకు ఆ రెండూ రావు.నాకు ఆ అవార్డు రానందుకు నాకు ఎలాంటి బాధ లేదని తెలిపారు.
అయితే ఒకసారి రామోజీరావు గారు నాతో మాట్లాడుతూ నీకు పద్మశ్రీ అవార్డు వచ్చిందా అని అడిగారు రాలేదు అని నేను చెప్పాను.దాంతో ఆయన మాట్లాడుతూ పద్మశ్రీ రాలేదని నువ్వేం బాధపడకు నువ్వు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉన్నావు.
అది నీకు పద్మశ్రీ కంటే గొప్ప అవార్డు అని అన్నారు.నేను పద్మశ్రీ గురించి ఆలోచించట్లేదు.
ఇప్పుడు అది రావాలంటే రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఉండాలి అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి.