సియాటెల్‌లోని ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ‘‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ’’

అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, మోంటానా వరల్డ్ అఫైర్స్ కౌన్సిల్ (Consulate General of India, Montana World Affairs Council)సంయుక్తంగా మోంటానాలో మొట్టమొదటి సారిగా ‘‘ఫెస్టివ్ ఆఫ్ ఇండియన్ సినిమా(Festival of Indian Cinema)’’ని నిర్వహించింది.ఈ సినిమాల ద్వారా భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించింది.

 Consulate General Of India In Seattle Organized Festival Of Indian Cinema , Fest-TeluguStop.com

మార్చి 2 నుంచి 4 వరకు మిస్సౌలాలోని మోంటానా విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన ఈ ఫెస్టివల్‌లో ఇంగ్లీష్ వింగ్లీష్, జిందగీ నా మిలేగీ దోబారా, రక్ష బంధన్ వంటి ప్రఖ్యాత భారతీయ చిత్రాలను ప్రదర్శించారు.మోంటానా అకడెమిక్ వరల్డ్ క్వెస్ట్ 2025లో పార్టిసిపేట్ చేసిన 500 మందికి పైగా విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో సియాటిల్ కాన్సుల్ జనరల్ ప్రకాష్ గుప్తా, హెలెనా విల్మోట్ కాలిన్స్ మేయర్, వరల్డ్ అఫైర్స్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిక్కీ గీజ్లర్(Seattle Consul General Prakash Gupta, Mayor Helena Wilmot Collins, World Affairs Council Executive Director Nikki Geisler) తదితరులు పాల్గొన్నారు.ఈ ఏడాది మోంటానా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల విద్యార్ధుల కోసం భారత్‌ను థీమ్ కంట్రీగా ప్రకటించి.

చలన చిత్రోత్సవాలతో పాటు భారతీయ శాస్త్రీయ నృత్యం, సంగీతం, భారత్‌లో విజయవంతంగా అమలవుతున్న డిజిటల్ చెల్లింపు వేదికలు, ఇటీవల ముగిసిన మహా కుంభమేళాపై ఇంటరాక్టివ్ సెషన్‌లు నిర్వహించారు.

Telugu Festival Indian, Indian, Mayorhelena, Montanaaffairs, Seattleconsul, Affa

ఇండియా థీమ్ కంట్రీ అకడమిక్ వరల్డ్ క్వెస్ట్‌లో గెలుపొందిన విద్యార్ధులకు ఈ ఏడాది చివరిలో భారత్‌ను సందర్శించే అవకాశం కల్పించనున్నారు.2005లో ప్రారంభమైన నాటి నుంచి అకడమిక్ వరల్డ్ క్వెస్ట్‌లో 4000 మందికి పైగా విద్యార్ధులు నిమగ్నమయ్యారు.ఇది దేశంలోనే అతిపెద్ద, గుర్తింపు పొందిన అంతర్జాతీయ విద్యా కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది.

Telugu Festival Indian, Indian, Mayorhelena, Montanaaffairs, Seattleconsul, Affa

ఇకపోతే.సియాటెల్‌లోని ఇండియన్ కాన్సులేట్ తన కొత్త వీసా అప్లికేషన్ సెంటర్‌ను గతేడాది ప్రారంభించింది.ఇది గ్రేటర్ సియాటెల్ ప్రాంతానికి వీసా, పాస్‌పోర్ట్ సేవలను అందిస్తుంది.అమెరికాలోని తొమ్మిది పసిఫిక్ వాయువ్య రాష్ట్రాలైన — అలాస్కా, ఇదాహో, మోంటానా, నెబ్రాస్కా, నార్త్ డకోటా, ఒరెగాన్, సౌత్ డకోటా, వాషింగ్టన్ , వ్యోమింగ్‌ పరిధిలోని భారతీయ ప్రవాస సమాజానికి ఈ కేంద్రం ప్రయోజనం చేకూరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube