తమ దేశంలోకి వచ్చే అంతర్జాతీయ వలసలను కట్టడి చేయాలని కెనడా ప్రభుత్వం( Government of Canada ) తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే విద్యార్ధి వీసాలు, స్టడీ పర్మిట్లు, వర్క్ పర్మిట్లు, శాశ్వత నివాసం వంటి అంశాల్లో కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.
అలాంటి కెనడా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.ఆరోగ్య సంరక్షణ, ట్రేడ్ వర్క్ కేటగిరీలో వీసా నిబంధనలను సులభతరం చేయాలని నిర్ణయించింది.
ఆరోగ్య సంరక్షణ రంగంలో యానిమల్ హెల్త్ టెక్నాలజిస్టులు, వెటర్నరీ టెక్నీషియన్లు, కార్డియాలజీ టెక్నాలజిస్టులు, డెంటల్ హైజీనిస్టులు, డెంటల్ థెరపిస్టులు, మెడికల్ టెక్నాలజిస్టులు, ఫార్మాసిస్ట్లు, ఫార్మసీ టెక్నీషియన్లు, సోషల్ , కమ్యూనిటీ సర్వీస్ వర్కర్లు వంటి వారికి సున్నితమైన ప్రమాణాలతో ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది.
2025 ఆర్ధిక సంవత్సరానికి గాను కెనడా ఎక్స్ప్రెస్ ఎంట్రీ కోసం కేటగిరీ ఆధారిత ఎంట్రీలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.2025 కోసం ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రోగ్రామ్లో విద్యారంగాన్ని కూడా చేర్చారు.అంతేకాకుండా వ్యవసాయ రంగంలోని నైపుణ్యం కలిగిన కార్మికులకు ఎక్స్ప్రెస్ ఎంట్రీని మంజూరు చేసే దిశగా కసరత్తు చేస్తోంది.

ట్రేడ్ వర్క్ కేటగిరీలో ఆయిల్ అండ్ గ్యాస్ డ్రిల్లింగ్ సర్వీస్ వర్కర్స్, ఫ్లోర్ కవరింగ్ ఇన్స్టాలర్లు, పెయింటర్లు, ఇంటీరియర్ డెకరేటర్లు , రూఫర్లు, షింగర్లు, కాంక్రీట్ ఫినిషర్లు, వాటర్ వెల్ డ్రిల్లర్లు, ఎలక్ట్రిక్ మెకానిక్స్, హెవీ-డ్యూటీ ఎక్విప్మెంట్ మెకానిక్స్( Heavy-duty equipment mechanics ), బ్రిక్లేయర్లు, క్యాబినెట్ మేకర్స్, గ్యాస్ ఫిట్టర్లు ,ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్లు వంటి నిపుణులు కూడా ఎక్స్ప్రెస్ ఎంట్రీ సిస్టమ్లో చేర్చబడతారు.

ఆయా వర్గాలకు కొత్త డ్రాను నిర్వహించనున్నారు.తక్కువ మెరిట్ అవసరాలతో కెనడాలోకి ఇది ప్రవేశాన్ని అనుమతిస్తుంది.ఇటీవల కెనడాలోని ఫెడరల్ ఎకనామిక్ ఇమ్మిగ్రెంట్ల ఎంపిక ప్రక్రియలో కొత్త విద్యా విభాగాన్ని ప్రకటించారు.
ఈ మార్పు కెనడా దీర్ఘకాలిక శ్రామిక శక్తి అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది.దేశంలో ముందస్తు పని అనుభవం ఉన్న వ్యక్తులకు శాశ్వత నివాసం కల్పించాలని నిర్ణయించింది.







